ఇప్పుడే ప్రారంభమైన **63 కి.మీ** Kanpur-Lucknow Expressway లో తీవ్రమైన నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. రోడ్డు కుంగిపోవడంతో NHAI వెంటనే కన్స్ట్రక్షన్ పనులు మళ్లీ చేపట్టాలని ఆదేశించింది. దీనివల్ల Toll వసూళ్లు నిలిచిపోవడంతో PNC Infratech ఆర్థికంగా చిక్కుల్లో పడింది.
ప్రతిష్టాత్మకంగా నిర్మించిన Kanpur-Lucknow Expressway ప్రారంభమైన కొద్ది రోజులకే భారీ ఎదురుదెబ్బ తగిలింది. జూలై 13, 2026న ట్రాఫిక్ కోసం తెరిచిన ఈ రహదారి, కొన్ని వారాల్లోనే కుంగిపోవడం, ఉపరితలం పగుళ్లు తేలడం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. నిపుణుల ప్రాథమిక విశ్లేషణలో, నిర్మాణ సామాగ్రి నాణ్యత కంటే.. నేల స్వభావం, డ్రైనేజీ వ్యవస్థల ప్లానింగ్‌లో లోపాలే ఈ విఫలానికి కారణమని తేలింది.
NHAI కఠిన నిర్ణయం
National Highways Authority of India (NHAI) పరిస్థితి తీవ్రతను గమనించి, Unnao సమీపంలోని కీలక ప్రాంతాలను సబ్-బేస్ స్థాయి నుండి మళ్లీ నిర్మించాలని ఆదేశించింది. కేవలం పైపైన రిపేర్లు చేస్తే సరిపోదని భావించిన అధికారులు, రహదారిని పూర్తిగా సురక్షితం చేసే వరకు Toll వసూళ్లను నిలిపివేశారు.
PNC Infratech పై ఒత్తిడి
ప్రాజెక్ట్ డెవలపర్ PNC Infratech కు ఇది డబుల్ దెబ్బ. ఒకటి.. Toll ఆదాయం ఆగిపోవడం, రెండు.. భారీ ఖర్చుతో మళ్లీ పనులు చేపట్టడం. Hybrid Annuity Model (HAM) కింద ఈ ప్రాజెక్ట్ చేపట్టినప్పటికీ, ఈ సంఘటన ఇప్పుడు కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇన్వెస్టర్లు ఏమి గమనించాలి?
ప్రస్తుతం కంపెనీ బాధ్యతాయుతంగా రిపేర్లు చేపడుతున్నట్లు పేర్కొన్నా, భవిష్యత్తులో ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకోవడంలో ఈ ఘటన ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. ఈ రీ-కన్స్ట్రక్షన్ ఎంతకాలం పడుతుంది, కంపెనీ నగదు నిల్వలపై (Cash flow) ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇన్వెస్టర్లు నిశితంగా గమనించాలి.
