Swiggy తన Instamart సర్వీస్ కోసం పేమెంట్ ప్రాసెస్‌లో మార్పులు చేసింది. RBI టోకనైజేషన్ నిబంధనలకు అనుగుణంగా, ఇప్పుడు యూజర్లు తమ పేమెంట్ కార్డులను Instamart కోసం విడిగా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది Swiggy కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ వల్ల వచ్చిన మార్పు.
కార్డ్ సేవ్ విధానంలో కొత్త రూల్
Swiggy తన క్విక్-కామర్స్ సర్వీస్ అయిన Instamart లో పేమెంట్ విధానాన్ని అప్‌డేట్ చేసింది. ఇకపై, ఫుడ్ డెలివరీ అకౌంట్‌కు వేరుగా, Instamart (గ్రోసరీ ఆర్డర్స్) కోసం పేమెంట్ కార్డులను విడిగా సేవ్ చేసుకోవాలి. రెండూ ఒకే యాప్‌లో ఉన్నా, పేమెంట్ డేటాను ఇప్పుడు వేర్వేరుగా పరిగణిస్తున్నారు. చెక్అవుట్ సమయంలో Swiggy, Instamart కోసం వేర్వేరు ట్యాబ్‌లను చూస్తారు. లావాదేవీలు సక్సెస్ అవ్వాలంటే, ప్రతి సర్వీస్ కోసం కార్డులను విడిగా స్టోర్ చేయడం తప్పనిసరి.
కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ ప్రభావం
ఈ మార్పులకు ప్రధాన కారణం.. Swiggy.. Instamart ను ఒక ప్రత్యేక సబ్సిడరీ (Swiggy Instamart) గా మార్చడమే. ఈ రీ-ఆర్గనైజేషన్‌లో భాగంగా, ఆస్తులు, ఉద్యోగులు, కాంట్రాక్టులను కొత్త ఎంటిటీకి బదిలీ చేశారు. దీనివల్ల గ్రోసరీ డెలివరీ బిజినెస్ కు ఎక్కువ స్వతంత్రత లభిస్తుంది. ఇన్వెస్టర్లు ఇలాంటి స్ట్రక్చరల్ మార్పులను నిశితంగా గమనిస్తారు. ఎందుకంటే, ఇవి క్విక్-కామర్స్ సెగ్మెంట్ పనితీరును, యూనిట్ ఎకనామిక్స్‌ను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
RBI టోకనైజేషన్ రూల్స్ & సెక్యూరిటీ
పేమెంట్ కార్డుల డేటాను విడిగా సేవ్ చేయాలనే నిబంధన.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించిన 'కార్డ్-ఆన్-ఫైల్ టోకనైజేషన్' రూల్స్ ఫలితమే. ఈ నిబంధనల ప్రకారం, కంపెనీలు కస్టమర్ల పూర్తి కార్డ్ నంబర్లు, CVV వంటి వివరాలను స్టోర్ చేయకూడదు. బదులుగా, ప్రతి వ్యాపార సంస్థకు ప్రత్యేకమైన టోకెన్లను (డిజిటల్ సబ్స్టిట్యూట్స్) వాడాలి. ఇప్పుడు Swiggy Instamart ఒక ప్రత్యేక ఎంటిటీగా రిజిస్టర్ అవ్వడంతో, ఒకదానికి క్రియేట్ చేసిన టోకెన్లను మరొకదానికి వాడటం కుదరదు. ఇది సెక్యూరిటీని పెంచుతుంది, కానీ యూజర్లకు చెక్అవుట్ సమయంలో అదనపు స్టెప్ అవుతుంది.
క్విక్-కామర్స్ పోటీ
క్విక్-కామర్స్ రంగంలో వేగవంతమైన డెలివరీ, సులభమైన షాపింగ్ అనుభవం కీలకం. Zomato (Blinkit), Zepto వంటి ప్రధాన పోటీదారులు మార్కెట్ వాటా కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో, చెక్అవుట్ ప్రక్రియలో ఎలాంటి అదనపు స్టెప్ అయినా యూజర్లకు ఇబ్బంది కలిగించవచ్చు. నియంత్రణల (Regulatory Compliance) పరంగా ఈ మార్పు తప్పనిసరి అయినప్పటికీ, యూజర్లు ఎంతవరకు దీనికి అలవాటు పడతారనేది చూడాలి. ఈ స్ట్రక్చరల్ మార్పులు, ఆపరేషనల్ మార్పులు.. పోటీతో కూడిన, ఎక్కువ పెట్టుబడులు అవసరమయ్యే క్విక్-కామర్స్ స్పేస్‌లో కంపెనీ లాభదాయకతను పెంచడంలో సహాయపడతాయా అని ఇన్వెస్టర్లు గమనిస్తారు. యూజర్ కన్వీనియన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ, కొత్త కార్పొరేట్ స్ట్రక్చర్ ద్వారా ఇన్వెంటరీ-లెడ్ మోడల్‌ను స్కేల్ చేయడం.. ఇన్వెస్టర్లకు ప్రధానంగా చూడాల్సిన అంశాలు.
