ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరణ డేటా సెంటర్లపై పెను భారాన్ని మోపుతోంది. విపరీతమైన విద్యుత్, నీటి వినియోగం కారణంగా ఆపరేషనల్ కాస్ట్ పెరుగుతోంది. ఫ్లాట్-ఫీ సబ్‌స్క్రిప్షన్ మోడల్ నుంచి డైనమిక్ ప్రైసింగ్‌లోకి మారే అవకాశం ఉంది.
క్లైమేట్ లిమిట్స్-ఎదురుదెబ్బ
AI రంగం వేగంగా విస్తరిస్తోంది, కానీ దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇప్పుడు ప్రకృతి వనరుల కొరతతో ఇబ్బందుల్లో ఉన్నాయి. 2025 నాటికి 485 TWh గా ఉన్న డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం, 2030 నాటికి ఏకంగా 950 TWh కి చేరవచ్చని అంచనా. ఈ భారీ డిమాండ్ గ్రిడ్లపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.
మారుతున్న బిజినెస్ మోడల్స్
ప్రస్తుతం చాలా AI సంస్థలు సాఫ్ట్‌వేర్ లాగే ఫ్లాట్-ఫీ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. కానీ, ప్రాంతాన్ని బట్టి విద్యుత్, నీటి ఖర్చులు మారుతుండటంతో, కంపెనీలు Usage-based Pricing (వాడకాన్ని బట్టి ఛార్జీలు) వైపు మళ్లే అవకాశం ఉంది. అంటే, ఈ అదనపు భారం నేరుగా కస్టమర్లపైనే పడనుంది.
ఇన్వెస్టర్లకు హెచ్చరిక
ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచేందుకు లిక్విడ్ కూలింగ్, సుస్థిర మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టే కంపెనీలే రేపు మార్కెట్‌లో నెగ్గుతాయి. పాత టెక్నాలజీతో నడిచే కంపెనీల మార్జిన్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో ఇప్పటికే డేటా సెంటర్ల నిర్మాణంపై ఆంక్షలు మొదలయ్యాయి. రాబోయే క్వార్టర్ రిజల్ట్స్‌లో మేనేజ్‌మెంట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ గురించి ఏం చెబుతారో గమనించడం ఇన్వెస్టర్లకు చాలా కీలకం.
