బ్రోకరేజ్ భారీ నమ్మకం.. ₹1800 టార్గెట్!
Motilal Oswal, Coforge ను ఒక స్ట్రక్చరల్ గా స్ట్రాంగ్ మిడ్-టైర్ IT ప్లేయర్ గా పరిగణిస్తోంది. మార్జిన్లు మెరుగుపడటం, నిలకడైన డీల్స్, AI-లెడ్ మేనేజ్డ్ సర్వీసెస్ కు డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ స్టాక్ పై 'BUY' రేటింగ్ ను పునరుద్ఘాటించింది. FY28E ఎర్నింగ్స్ పర్ షేర్ (EPS) పై 26 రెట్లు వాల్యుయేషన్ తో, బ్రోకరేజ్ ఈ స్టాక్ కు ₹1800 టార్గెట్ ప్రైస్ ను సెట్ చేసింది. ఇది ప్రస్తుత స్థాయిల నుంచి 54% వరకు అప్ సైడ్ ను సూచిస్తుంది.
Q4 లో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్
Coforge నాలుగో క్వార్టర్ లో స్ట్రాంగ్ ఫలితాలను నమోదు చేసింది. కాన్స్టాంట్ కరెన్సీలో రెవిన్యూ 2% QoQ గ్రోత్ సాధించింది. ఇది Motilal Oswal అంచనా వేసిన 1.5% ను మించింది. ఈ పనితీరు కంపెనీ ఆపరేషనల్ స్ట్రెంత్ ను, మార్కెట్ లో దాని పొజిషన్ ను తెలియజేస్తుంది.
ఆర్డర్ బుక్ తో ఫ్యూచర్ కి భరోసా
నాలుగో క్వార్టర్ లో ఆర్డర్ ఇన్ టేక్ $648 మిలియన్ గా ఉన్నప్పటికీ, కంపెనీ $1.75 బిలియన్ విలువైన 12-నెలల ఎగ్జిక్యూటబుల్ ఆర్డర్ బుక్ ను సొంతం చేసుకుంది. ఈ భారీ పైప్ లైన్, భవిష్యత్ రెవిన్యూలకు మంచి విజిబిలిటీని అందిస్తుంది.
మార్జిన్లు మెరుగుపడ్డాయి.. ప్రాఫిట్ దూసుకుపోయింది
EBIT మార్జిన్లు 16.6% కి మెరుగుపడ్డాయి, ఇది మార్కెట్ అంచనాలైన 15% కంటే మెరుగ్గా ఉంది. అడ్జస్టెడ్ PAT (Net Profit) ఏడాదికి 119% పెరిగి ₹6.6 బిలియన్ కు చేరింది. ఇది మార్కెట్ అంచనా అయిన ₹4.8 బిలియన్ ను అధిగమించింది. FY26 కి ఫ్రీ క్యాష్ ఫ్లో (FCF) టు నెట్ ఇన్ కమ్ (NI) రేషియో 76.3% గా ఉంది.
