అసలు ఏం జరిగింది?
డబ్బుల అక్రమ రవాణా (Money Laundering) ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ Gameskraft పై కీలక చర్య తీసుకుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరులో సోదాలు నిర్వహించిన ED, ఈ సంస్థకు చెందిన బ్యాంకుల్లో ఉన్న ₹526.49 కోట్ల డిపాజిట్లను, దాదాపు ₹3.5 కోట్ల విలువైన బంగారం, ₹11 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ చట్టాల కింద ఈ ఆస్తులను స్తంభింపజేశారు.
Gameskraft అక్రమాల వెనుక కథ
Gameskraft తమ ప్లాట్‌ఫామ్స్ ద్వారా, ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్ ను చట్టవిరుద్ధంగా నిర్వహిస్తోందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా, కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్ రమ్మీ నిషేధంలో ఉన్నా, Geo-location టెక్నాలజీని తప్పుగా వాడుకుని, అక్కడ కూడా గేమ్‌లను ఆడిస్తున్నారని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, ఆటగాళ్లు మనుషులతో కాకుండా, కంప్యూటర్ అల్గారిథమ్స్ (Bots) తో ఆడుతున్నట్లు కూడా ED గుర్తించినట్లు సమాచారం.
వ్యవస్థాపకులకు అరెస్ట్, ఆటగాళ్లకు భారీ నష్టం
ఈ సోదాల అనంతరం, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న Gameskraft ముగ్గురు వ్యవస్థాపకులను ED అరెస్ట్ చేసింది. వీరిలో దీపక్ సింగ్, పృథ్వీ రాజ్ సింగ్, వికాస్ తనేజా ఉన్నారు. మోసం, చీటింగ్ ఆరోపణలపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఈ మనీలాండరింగ్ విచారణ మొదలైంది. ఈ మొత్తం వ్యవహారంలో, Gameskraft ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు దాదాపు ₹1,154 కోట్ల వరకు నష్టపోయారని ED అంచనా వేస్తోంది.
ఈ విచారణలో కీలకమైనవి
Gameskraft Technologies Ltd, దాని అనుబంధ సంస్థలు ఇప్పుడు ఈ మనీలాండరింగ్ విచారణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 'RummyCulture', 'rummytime app' వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా జరిగిన అక్రమ ఆర్థిక కార్యకలాపాలపై ED దృష్టి సారించింది.
