Apple ప్రస్థానం: విజయాలు.. వైఫల్యాలు
Apple Inc. తన 50వ ఏట అడుగుపెడుతూ, $4 ట్రిలియన్ మార్క్ దాటింది. ఈ అసాధారణ వాల్యుయేషన్ సాధించడానికి, కంపెనీ ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ముఖ్యంగా, మార్కెట్లో ఆశించినంతగా ఆడలేకపోయిన కొన్ని ప్రొడక్ట్స్.. Apple ను మరింత పదును పెట్టాయి.
1. Apple Lisa: ఖరీదైన పాఠం
1983లో విడుదలైన Apple Lisa, మౌస్, గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్‌లను పరిచయం చేయడంలో విప్లవాత్మకమైనది. అయితే, $9,995 అనే అధిక ధర, నెమ్మదిగా పనిచేయడం వల్ల చాలా మంది వినియోగదారులకు ఇది అందుబాటులో లేకుండా పోయింది. వాణిజ్యపరంగా విజయం సాధించలేకపోయినా, ఆనాటి టెక్నాలజీకి ఇది మార్గదర్శకంగా నిలిచింది.
2. Pippin గేమింగ్ కన్సోల్: అంచనాలు అందుకోలేకపోయింది
1990ల మధ్యలో, Apple, Bandaiతో కలిసి Pippin అనే గేమింగ్, మల్టీమీడియా కన్సోల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. $599 ధరతో వచ్చిన దీనికి, Sony PlayStation వంటి పోటీదారుల నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. తక్కువ సాఫ్ట్‌వేర్ ఆప్షన్స్, బలహీనమైన బ్రాండ్ గుర్తింపుతో, ప్రపంచవ్యాప్తంగా కేవలం 50,000 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. స్టీవ్ జాబ్స్ తిరిగి వచ్చిన తర్వాత దీనిని నిలిపివేశారు.
3. Power Mac G4 Cube: డిజైన్ ఉన్నా.. ధర ఎక్కువ!
2000లో వచ్చిన Power Mac G4 Cube, దాని ప్రత్యేకమైన యాక్రిలిక్ డిజైన్‌తో ఆకట్టుకుంది. అయితే, మానిటర్‌తో కలిపి సుమారు $1,799 ధర ఉండటంతో, అప్పటికి మార్కెట్లో ఉన్న ఇతర డెస్క్‌టాప్‌ల కంటే ఇది చాలా ఖరీదైనదిగా మారింది. తక్కువ అమ్మకాలు (సుమారు 1,50,000-2,00,000 యూనిట్లు) నమోదవ్వడంతో 2001లో దీనిని నిలిపివేశారు. దీని డిజైన్ నుండి ప్రేరణతోనే ఇప్పుడు Mac Studio రూపొందించబడింది.
4. FireWire: నెమ్మదిగా ఆమోదం
1995లో హై-స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ప్రవేశపెట్టిన Apple FireWire, USB టెక్నాలజీతో పోటీ పడలేకపోయింది. టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఉన్న ఫీజుల కారణంగా అనేక తయారీదారులు దీనిని వాడటానికి ఆసక్తి చూపలేదు. కాలక్రమేణా, USB టెక్నాలజీ మెరుగుపడటంతో FireWire ప్రాముఖ్యత తగ్గి, 2011లో Apple దీన్ని అధికారికంగా నిలిపివేసింది.
5. Butterfly Keyboard: వినియోగదారుల చిరాకు
2015లో MacBook Proలలో పరిచయం చేసిన Butterfly Keyboard, సన్నని డిజైన్‌తో ఆకట్టుకున్నా.. దుమ్ము పడటం, కీలు సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలతో వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్యల పరిష్కారం కోసం Apple $50 మిలియన్ క్లాస్-యాక్షన్ దావాను కూడా పరిష్కరించుకోవాల్సి వచ్చింది. 2019 నాటికి ఈ డిజైన్‌ను దశలవారీగా తొలగించి, పాత సిజర్-స్విచ్ మెకానిజానికి తిరిగి వచ్చింది.
6. iPhone 5c: విస్తృత మార్కెట్ లక్ష్యంగా..
2013లో విడుదలైన iPhone 5c, రంగురంగుల ప్లాస్టిక్ బాడీ, తక్కువ ధరతో ఎక్కువ మందిని ఆకట్టుకోవాలని Apple ప్రయత్నించింది. అయితే, మెటల్ బాడీ ఫోన్‌లతో పోలిస్తే దీని ప్లాస్టిక్ డిజైన్ తక్కువ ప్రీమియంగా కనిపించింది. iPhone 5s తో పోలిస్తే దీని అమ్మకాలు బాగా వెనుకబడ్డాయి. అయినప్పటికీ, ఇది iPhone SE వంటి విజయవంతమైన సిరీస్‌లకు మార్గం సుగమం చేసింది.
ఈ ప్రొడక్ట్స్ అన్నీ వాణిజ్యపరంగా భారీ విజయాలు సాధించకపోయినా, Apple కు ఎంతో విలువైన అనుభవాలను, పాఠాలను నేర్పాయి. మార్కెట్ ఫీడ్‌బ్యాక్‌ను విశ్లేషించి, గత అనుభవాలను భవిష్యత్ ఆవిష్కరణలుగా మార్చుకునే Apple సామర్థ్యమే దాని నిరంతర విజయానికి కారణమని చెప్పవచ్చు.