AI తో ఉద్యోగ మార్పులు - అసలు కథేంటి?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలు, ఇండియాలోని ఐటీ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌లో మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. Tata Consultancy Services (TCS) దాదాపు 31,000 మందిని, Wipro Ltd. 3,500 మందికి పైగా ఉద్యోగులను తగ్గించుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కోడింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి రిపీట్ అయ్యే పనులను AI ఏజెంట్లు మనుషుల కంటే వేగంగా, సమర్థవంతంగా చేయడంతో, గతంలో జోరుగా జరిగిన హైరింగ్ ఇప్పుడు తగ్గిపోతోంది.
ఇండియాలో నైపుణ్యాల పునరుద్ధరణ (Reskilling)
ఇది కేవలం మార్కెట్ స్లోడౌన్ కాదని, ఉద్యోగ మార్కెట్‌లో వస్తున్న ఒక స్ట్రక్చరల్ మార్పు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కోఆర్డినేషన్ పనులు చూసే మిడ్-మేనేజ్‌మెంట్ రోల్స్ తగ్గుముఖం పడుతున్నాయి. పాత సిస్టమ్స్ నిర్వహణ, బేసిక్ అనలిటిక్స్ వంటి వాటికి డిమాండ్ కూడా పడిపోతోంది. అయితే, ఈ మార్పులకు ఇండియా సిద్ధమవుతోందని తెలుస్తోంది. పరిశ్రమలన్నింటిలోనూ రెసికిల్లింగ్ (Reskilling) ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. Nasscom నివేదిక ప్రకారం, ఇప్పటికే 2 మిలియన్ (20 లక్షలకు పైగా) మంది ప్రొఫెషనల్స్ AI లో కొత్త నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు. 'హ్యూమన్ + AI' టీమ్స్ ను నిర్మించడంపై వీరు దృష్టి సారిస్తున్నారు.
కొత్త స్కిల్స్ కు అధిక ప్రాధాన్యత
Mercer నివేదిక ప్రకారం, ఇండియాలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు AI ట్రాన్స్‌ఫర్మేషన్‌కు, హ్యూమన్-మెషిన్ టీమ్‌వర్క్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దాదాపు 74% C-సూట్ లీడర్స్ 'స్కిల్స్-ఫస్ట్' స్ట్రాటజీని అవలంబిస్తున్నారు. దీంతో జనరల్ టాలెంట్ కొరత పెద్ద సమస్యగా మారడం లేదు. కంపెనీలు AI, క్లౌడ్, ప్లాట్‌ఫాం ఇంజనీరింగ్ వంటి కొత్త నైపుణ్యాలున్న వారిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాయి. జనరేటివ్ AI ఇంజనీర్స్, ML ఆపరేషన్స్ ప్రొఫెషనల్స్ వంటి స్పెషలిస్ట్ రోల్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ స్పెషల్ స్కిల్స్ ఉన్నవారికి 20-40% వరకు అదనపు జీతాలు (Compensation Premiums) వస్తున్నాయి. ఇలాంటి కాంప్లెక్స్ పొజిషన్స్‌కు హైరింగ్ చేయడానికి ఇప్పుడు 75-90 రోజులు పడుతోంది.
GCCల అండతో హైరింగ్
ఇండియాలో పెరుగుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs) కూడా టెక్ టాలెంట్‌ను ఆదుకుంటున్నాయి. ముఖ్యంగా మిడ్-లెవెల్ రోల్స్‌లో హైరింగ్ గతంలో 40% ఉండగా, ఇప్పుడు 60-65% కి పెరిగింది. ఎంట్రీ-లెవెల్ హైరింగ్ కొద్దిగా తగ్గినా, బెంగళూరు, ఢిల్లీ NCR వంటి నగరాల్లో GCCలు R&D సెంటర్లు, AI కేపబిలిటీలను నిర్మిస్తున్నాయి. దీనితో AI ఆధారిత మార్పులను ముందుకు నడిపించడానికి అవసరమైన అడ్వాన్స్‌డ్ టెక్ ఎక్స్‌పర్టీస్, లీడర్‌షిప్ రోల్స్‌కు డిమాండ్ ఏర్పడుతోంది.