స్పేషియల్ ఇంటర్నెట్ కు పునాది వేస్తున్న Ctruh
ఈ నిధులను ఉపయోగించి, Ctruh తమ బ్రౌజర్-నేటివ్ 3D ఇంజిన్, VersaAI ప్లాట్‌ఫామ్ కోసం పరిశోధన, అభివృద్ధి (R&D) పనులను వేగవంతం చేయనుంది. అంతేకాకుండా, తమ కార్యకలాపాలను అమెరికా (U.S.) మరియు యూఏఈ (UAE) మార్కెట్లలోకి విస్తరించడానికి కూడా ఈ డబ్బును వినియోగించనుంది.
XR టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా XR (ఎక్స్‌టెండెడ్ రియాలిటీ) మార్కెట్ ఊపందుకుంటోంది. 2026 నాటికి ఈ మార్కెట్ విలువ $346 బిలియన్ కు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో, Ctruh తమ టెక్నాలజీతో ఇమ్మర్సివ్ (Immersive) డిజిటల్ అనుభవాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణంగా 3D, XR కంటెంట్ ను రూపొందించడానికి అధిక ఖర్చు, ప్రత్యేక నైపుణ్యం అవసరం. కానీ, Ctruh అందిస్తున్న బ్రౌజర్-నేటివ్, నో-కోడ్/లో-కోడ్ 3D ఇంజిన్, VersaAI ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలాంటి అదనపు డౌన్‌లోడ్‌లు, ప్రత్యేక హార్డ్‌వేర్ లేకుండానే ఏ పరికరంలోనైనా నాణ్యమైన ఇమ్మర్సివ్ అనుభవాలను పొందవచ్చు.
మార్కెట్ అవకాశాలు, Ctruh వ్యూహం
AI-జనరేటెడ్ 3D ఆస్తుల మార్కెట్ 2032 నాటికి $9.24 బిలియన్ కు, స్పేషియల్ కంప్యూటింగ్ మార్కెట్ 2035 నాటికి $1.2 ట్రిలియన్ కు చేరుతుందని అంచనా. Ctruh అందిస్తున్న VersaAI ఇంజిన్, చిత్రాలు, టెక్స్ట్, వీడియోలను 3D ఆస్తులుగా మారుస్తుంది. దీని ద్వారా వ్యాపారాలు కేవలం 30 నిమిషాలలోపుపు ఆకర్షణీయమైన 3D అనుభవాలను అందించే Commverse Studio వంటి ఫ్లాట్‌ఫామ్స్ ని అందుబాటులోకి తేవచ్చు. AR (ఆగ్మెంటెడ్ రియాలిటీ) సాయంతో నడిచే ఉత్పత్తులు 94% అధిక కన్వర్షన్ రేట్లను అందిస్తున్నాయని, 2026 నాటికి 80% రిటైలర్లు AR ను స్వీకరిస్తారని అంచనాలున్నాయి. XR హార్డ్‌వేర్ అమ్మకాలు కూడా 2026 నాటికి 87% పుంజుకుంటాయని భావిస్తున్నారు.
సవాళ్లు, పోటీ
ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ, ఆయా కంపెనీలు తమ టెక్నాలజీని నిలకడగా మార్కెట్ లో నిలబెట్టుకోవడం ఒక సవాలు. Ctruh సంస్థ mirrAR, Eccentric, Metadome.ai వంటి ఇతర కంపెనీల నుండి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. Apple Vision Pro వంటి ఖరీదైన హార్డ్‌వేర్ మాస్ అడాప్షన్ కు ఆటంకంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో, సాఫ్ట్‌వేర్ మౌలిక సదుపాయాలపై Ctruh దృష్టి సారించడం వ్యూహాత్మకమని విశ్లేషకులు భావిస్తున్నారు.
