SEBI తన నిబంధనలను కఠినతరం చేసే పనిలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు దాదాపు ₹1.9 లక్షల కోట్లు సమీకరించడంతో, IPO మరియు FPO లలో నాణ్యత, వాల్యుయేషన్లు మరియు ప్రాఫిటబిలిటీపై ప్రైమరీ మార్కెట్స్ అడ్వైజరీ కమిటీ (PMAC) ద్వారా పూర్తిస్థాయి సమీక్ష చేపట్టింది.
నిబంధనల్లో మార్పుల వెనుక కారణం
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఇప్పుడు Initial Public Offerings (IPO) మరియు Further Public Offers (FPO)లకు సంబంధించి ICDR రెగ్యులేషన్లను సమగ్రంగా సమీక్షిస్తోంది. గత ఏడాది మార్కెట్ నుంచి ₹1.9 లక్షల కోట్లు నిధులు సమీకరణ జరిగిన నేపథ్యంలో, మార్కెట్లోకి వచ్చే కంపెనీల ఆర్థిక నాణ్యతపై సెబీ ఆందోళన చెందుతోంది.
ప్రాఫిటబిలిటీ & వాల్యుయేషన్లపై నిఘా
ప్రైమరీ మార్కెట్స్ అడ్వైజరీ కమిటీ (PMAC) పరిధిలోని ఒక సబ్-గ్రూప్ ఇప్పుడు కంపెనీల ఎలిజిబిలిటీ క్రైటీరియాతో పాటు వాల్యుయేషన్ల ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా అగ్రెసివ్ వాల్యుయేషన్లతో మార్కెట్లోకి వస్తున్న కొత్త కంపెనీల విషయంలో కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీనివల్ల స్టార్టప్‌లు లేదా కొత్త కంపెనీలకు మార్కెట్ ఎంట్రీ మరింత కష్టతరం కావచ్చు.
SME విభాగం తరహాలోనే మెయిన్ బోర్డులోనూ..
ఈ చర్య అంతకుముందు SME IPO సెగ్మెంట్లో తీసుకున్న నిర్ణయాలకు కొనసాగింపుగా కనిపిస్తోంది. SME విభాగంలో లాభాల నిబంధనలను కఠినతరం చేసినట్టే, మెయిన్ బోర్డులో కూడా 2018 నాటి నిబంధనలను ఆధునీకరించాలని SEBI భావిస్తోంది. తద్వారా మార్కెట్ మానిప్యులేషన్లను అరికట్టి, రిటైల్ ఇన్వెస్టర్ల సొమ్ముకు భద్రత కల్పించడం సెబీ ప్రధాన ఉద్దేశ్యం. కమిటీ సిఫార్సులు అమల్లోకి వస్తే, IPOలకు వెళ్లే కంపెనీల నాణ్యత ప్రమాణాలు మరింతగా పెరగనున్నాయి.
