IPO నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు SEBI కీలక ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇప్పటివరకు ఉన్న పరిమితులను తొలగిస్తూ, అన్ని IPOలకు ఎక్స్టర్నల్ మానిటరింగ్ తప్పనిసరి చేస్తోంది.
కొత్త నిబంధనలు ఏమిటి?
ప్రస్తుత మార్కెట్ రూల్స్ ప్రకారం, మెయిన్ బోర్డులో ₹100 కోట్ల కంటే ఎక్కువ, SME ఎక్స్ఛేంజీలలో ₹50 కోట్ల కంటే ఎక్కువ నిధులు సేకరించే IPOలకు మాత్రమే ఎక్స్టర్నల్ మానిటరింగ్ ఉంటుంది. కానీ, ఇకపై ఈ పరిమితులను పూర్తిగా తొలగించాలని SEBI భావిస్తోంది. అంటే ఎంత చిన్న IPO అయినా సరే, ఇకపై ఇండిపెండెంట్ పర్యవేక్షణ ఉండాల్సిందే.
కఠినమైన రిపోర్టింగ్ రూల్స్
ఈ కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం, కంపెనీలు నిధులను ఎలా ఖర్చు చేస్తున్నాయో మానిటరింగ్ ఏజెన్సీలు ప్రతి క్వార్టర్ ముగిసిన 45 రోజుల్లోపు స్టాక్ ఎక్స్ఛేంజీలకు రిపోర్ట్ సమర్పించాలి. ఒకవేళ కంపెనీలు సహకరించకపోతే, ప్రమోటర్ల షేర్లను ఫ్రీజ్ చేయడం లేదా భారీ జరిమానాలు విధించేలా SEBI ప్లాన్ చేస్తోంది.
ఫోరెన్సిక్ సవాలు మరియు ఆందోళనలు
ఐడియా బాగున్నా, దీని అమలుపై మార్కెట్ నిపుణులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అకౌంట్స్ చూడటంలో దిట్టే కానీ, కంపెనీలు చెబుతున్నట్లుగా ప్లాంట్లు, మెషినరీ కొన్నాయా లేదా అని ఫిజికల్ వెరిఫికేషన్ లేదా ఫోరెన్సిక్ తనిఖీలు చేయడానికి అవి సిద్ధంగా ఉన్నాయా అనేది పెద్ద డౌట్. పైగా, ఈ రేటింగ్ ఏజెన్సీలకు ఫీజులు చెల్లించేది ఆ కంపెనీలే కాబట్టి, 'కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' వచ్చే అవకాశం ఉందన్న ఆందోళన కూడా ఉంది.
