మార్కెట్ క్లోజింగ్ సమయంలో తలెత్తుతున్న వొలాటాలిటీని తగ్గించేందుకు SEBI కీలక ప్రతిపాదనలు చేసింది. Closing Auction Session (CAS) మరియు సెటిల్‌మెంట్ ధరల లెక్కల్లో మార్పులు చేస్తూ కొత్త డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది.
మార్కెట్ ముగిసే సమయంలో ఉండే వొలాటాలిటీని, లిక్విడిటీ సమస్యలను పరిష్కరించేందుకు SEBI నడుం బిగించింది. ఆగస్టు 3, 2026న అమల్లోకి వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS)లో కొన్ని మార్పులు చేస్తూ రెగ్యులేటర్ కొత్త కన్సల్టేషన్ పేపర్ విడుదల చేసింది.
సెటిల్‌మెంట్ ధరల్లో మార్పులు
ఎక్స్‌పైరీ రోజుల్లో డెరివేటివ్ ట్రేడర్లకు సెటిల్‌మెంట్ ధర అనేది చాలా కీలకం. ప్రస్తుతం ఇది చివరి 30 నిమిషాల VWAP ఆధారంగా నిర్ణయమవుతోంది. అయితే, ఇకపై చివరి 30 నిమిషాల ట్రేడింగ్‌తో పాటు, 10 నిమిషాల క్లోజింగ్ ఆక్షన్ సెషన్‌ను కూడా కలిపి 'బ్లెండెడ్' పద్ధతిలో ధరను లెక్కించాలని SEBI యోచిస్తోంది. ఒకవేళ ఇది కాకపోతే, ప్రస్తుత పద్ధతినే మరో ఏడాది పాటు కొనసాగించే అవకాశం కూడా ఉంది.
ఆర్డర్ క్యాన్సిలేషన్‌పై ఆంక్షలు
చివరి నిమిషాల్లో ఆర్డర్ మానిప్యులేషన్‌ను అడ్డుకునేందుకు SEBI కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. రిఫరెన్స్ ప్రైస్ కంటే 1% కంటే ఎక్కువ తేడాతో ఉండే ఆర్డర్లను లాక్ చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల ఫేక్ మూవ్‌మెంట్స్ తగ్గుతాయి. అలాగే, ఇన్వెస్టర్లలో గందరగోళం కలిగిస్తున్న Indicative Index Values (IIV) డిస్‌ప్లేను క్లోజింగ్ ఆక్షన్‌లో నిలిపివేయాలని నిర్ణయించింది.
మార్కెట్ టైమింగ్‌లో రెండు ఆప్షన్లు
- ఆప్షన్ 1: CAS స్టాక్స్‌కు ట్రేడింగ్ సమయాన్ని 3:30 PM వరకు పొడిగించి, ఆ తర్వాత ఆక్షన్ నిర్వహించడం. డెరివేటివ్ మార్కెట్ 3:45 PMకి ముగుస్తుంది.
- ఆప్షన్ 2: ప్రస్తుతమున్న 3:15 PM కటాఫ్ సమయాన్ని అలాగే ఉంచడం.
ఈ ప్రతిపాదనలపై ఇన్వెస్టర్లు, బ్రోకర్లు తమ అభిప్రాయాలను అక్టోబర్ 3, 2026లోపు తెలియజేయవచ్చు.
