TVS గ్రూప్ ప్రమోటర్ కుటుంబంలో మొదలైన వారసత్వ గొడవలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వివాదం వల్ల మైనారిటీ షేర్ హోల్డర్ల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని ప్రోక్సీ అడ్వైజరీ సంస్థ InGovern హెచ్చరించింది.
TVS గ్రూప్ నియంత్రిస్తున్న వేణు శ్రీనివాసన్ కుటుంబంలో నెలకొన్న వారసత్వ వివాదం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ గొడవలు కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా, కంపెనీ గవర్నెన్స్‌పై ప్రభావం చూపుతాయని ప్రోక్సీ అడ్వైజరీ సంస్థ InGovern Research Services స్పష్టం చేసింది.
గొడవ ఎక్కడ మొదలైంది?
ఈ వివాదంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకవైపు వేణు శ్రీనివాసన్, ఆయన కుమారుడు సుదర్శన్ వేణు ఉండగా, మరోవైపు మల్లికా శ్రీనివాసన్, ఆమె కుమార్తె లక్ష్మీ వేణు ఉన్నారు. 2024 మార్చిలో కుదిరిన మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU)పై ఈ భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. 2020లో ఇప్పటికే ఒక పరిష్కారం జరిగిందని ఒక వర్గం వాదిస్తుంటే, ఆర్థిక పరమైన సెటిల్మెంట్ ఇంకా పూర్తి కాలేదని మరో వర్గం వాదిస్తోంది.
ఇన్వెస్టర్లపై ప్రభావం ఏంటి?
ప్రమోటర్ల మధ్య మొదలైన ఈ ఫ్రిక్షన్, కోర్టుల వరకు వెళ్లింది. ఇప్పటికే ఇరు వర్గాలు NCLT మరియు చెన్నై కోర్టులలో కేవియట్ పిటిషన్లు దాఖలు చేసుకున్నాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ, టీవీఎస్ హోల్డింగ్స్ ప్రస్తుతం ఆపరేషనల్ పరంగా స్టెబిలిటీగానే ఉన్నప్పటికీ, ప్రమోటర్ స్థాయిలో ఐక్యత లోపించడం దీర్ఘకాలిక నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఇన్ గవర్న్ అభిప్రాయపడింది.
ఏం జరగవచ్చు?
వ్యాపార విలువలు, యాజమాన్య ఒప్పందాలు అనేవి చట్టపరమైన నిబంధనల ప్రకారం జరగాలే తప్ప, బహిరంగ వివాదాల వల్ల కాకూడదని ఇన్ గవర్న్ సూచించింది. భవిష్యత్తులో ఈ పరిణామాలు షేర్ హోల్డర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, కంపెనీ అధికారికంగా ఎలాంటి వెల్లడి (Disclosures) చేస్తుందో చూడాలని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చింది.
