కర్ణాటకలో ఓటర్ల పేర్ల తొలగింపు కోసం 'Form 7'ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై Election Commission of India (ECI) సీరియస్ అయ్యింది. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు జరిగిన ఈ కుట్రపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ (Physical Verification) మొదలుపెట్టారు.
కర్ణాటక ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఒక వ్యవస్థీకృత ప్రయత్నం జరుగుతోందని రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో, ఈసీ రంగంలోకి దిగింది. ముఖ్యంగా విజయనగర, బెళగావి, విజయపుర, మరియు బీదర్ జిల్లాల్లో ఓటర్ల తొలగింపు దరఖాస్తులు అసాధారణంగా పెరగడంపై అధికారులు దృష్టి సారించారు.
అక్రమాల వెనుక కథాకమీమిషు?
ఓటరు జాబితా నుండి పేరు తొలగించడానికి ఉపయోగించే 'Form 7' పత్రాలను ముందుగానే ప్రింట్ చేసి, సంతకాలు సేకరించడం ద్వారా ఈ కుట్ర సాగుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా మైనారిటీలు, దళితులు మరియు గిరిజన సామాజిక వర్గాల ఓటర్లను టార్గెట్ చేస్తూ ఈ తొలగింపులు జరగడం పట్ల ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజిటల్ రికార్డులను మాత్రమే నమ్ముకోకుండా, ప్రతి క్లెయిమ్‌ను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలని Electoral Registration Officers ని ఆదేశించింది.
డేటా లీకేజీపై ఆందోళన
ఓటరు ఐడిలు మరియు కీలక డేటా బయటకు లీక్ అయ్యాయని, వాటిని ఉపయోగించి అక్రమంగా ఫామ్స్ నింపారని ప్రాథమికంగా గుర్తించారు. దీనికి బాధ్యులైన వారిని గుర్తించేందుకు ప్రతి బూత్ స్థాయిలో ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఈ విచారణలో ఎవరైనా తప్పుడు సమాచారంతో ఓటర్లను తొలగించేందుకు ప్రయత్నించినట్లు తేలితే, ఎన్నికల నిబంధనల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈసీ స్పష్టం చేసింది.
