భారీ లీజుతో విస్తరణ
ఈ భారీ లీజుతో, Redbrick Offices.. పుణెలో పెద్ద ఎంటర్ ప్రైజెస్, హై-గ్రోత్ స్టార్టప్స్, గ్లోబల్ క్లయింట్స్ కు ప్రీమియం కో-వర్కింగ్, మేనేజ్డ్ ఆఫీస్ సొల్యూషన్స్ ను మరింత సమర్థవంతంగా అందించగలదు. Redbrick Offices చైర్మన్ & MD, ఆయుష్ గోయెంకా ఈ సందర్భంగా మాట్లాడుతూ, "మాకు ఇది కేవలం స్థలాన్ని జోడించడం కాదు. భవిష్యత్తు కోసం నిర్మించడం" అని తన దీర్ఘకాలిక వ్యూహాన్ని వివరించారు.
పుణెలోని ప్రముఖ టెక్ కారిడార్ లో Redbrick తన నిబద్ధతను ఈ డీల్ తో మరింతగా చాటుకుంది. AP4 టెక్ పార్క్.. అమేర్ బిల్డర్స్, ప్రిస్టీన్ ప్రాపర్టీస్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన గ్రేడ్ A ఐటీ ప్రాజెక్ట్. ఇది మొత్తం 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఆధునిక మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన డిజైన్ తో, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) నుండి ప్రీ-సర్టిఫైడ్ ప్లాటినం రేటింగ్ ను కూడా పొందింది.
పెరుగుతున్న డిమాండ్ ను అందుకోవడానికి..
ఈ లీజు.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs), ఐటీ కంపెనీలు, ఇతర గ్లోబల్ సంస్థల నుండి వస్తున్న ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ ల డిమాండ్ ను సమర్థవంతంగా తీర్చడానికి Redbrick ను సిద్ధం చేసింది. Redbrick వారి 'Space-as-a-Service' మోడల్, 2015లో ప్రారంభించారు. ఇది తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. ప్రస్తుతం 300 పైగా ఎంటర్ ప్రైజ్ క్లయింట్స్ కు, ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలకు సేవలు అందిస్తోంది.
Redbrick భవిష్యత్ ప్రణాళికలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60కి పైగా సెంటర్లలో 5 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని నిర్వహిస్తున్న Redbrick Offices, 2028 నాటికి తమ పోర్ట్ ఫోలియోను రెట్టింపు చేసి 10 మిలియన్ చదరపు అడుగులకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. పుణెను కీలక వృద్ధి మార్కెట్ గా గుర్తించిన కంపెనీ, ఉత్పాదకతను, ఉద్యోగుల సంక్షేమాన్ని మెరుగుపరిచే హాస్పిటాలిటీ-ఆధారిత, ESG-కంప్లైంట్ వర్క్ స్పేస్ లను అందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించింది.