భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. అమ్మడుపోని ఇళ్ల నిల్వలు (Unsold Inventory) **6.1 క్వార్టర్లకు** పెరగగా, సేల్స్ గ్రోత్ మాత్రం మందకొడిగా సాగుతోంది. ప్రస్తుతం లగ్జరీ ఇళ్లకు మాత్రమే డిమాండ్ ఉండటంతో, మిడ్-రేంజ్ మరియు ఎఫర్డబుల్ హౌసింగ్ రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం ఒక సంక్లిష్టమైన దశలో ఉంది. ప్రధాన నగరాల్లో రెసిడెన్షియల్ సేల్స్ మూడవ క్వార్టర్ 2026 నాటికి 3% వృద్ధిని నమోదు చేసినప్పటికీ, మార్కెట్‌లో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే.. అమ్మడుపోని ఇళ్ల సంఖ్య (Unsold Units) 6.3 లక్షలు దాటడం.
మార్కెట్‌లో 'క్వార్టర్స్ టు సెల్' (Quarters to sell) అనే కొలమానం గత ఏడాది 5.8 గా ఉండగా, ఇప్పుడు అది 6.1 కి పెరిగింది. అంటే డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను వేగంగా లాంచ్ చేస్తున్నా, కొనుగోలుదారులు మాత్రం ఆ స్థాయిలో ముందుకు రావడం లేదు.
లగ్జరీ ఇళ్లదే హవా!
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ 'టూ-స్పీడ్' మోడ్‌లో నడుస్తోంది. ₹1 కోటి కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీలకే డిమాండ్ ఎక్కువగా ఉంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా ఏకంగా 55% గా ఉంది. కానీ, ఎఫర్డబుల్ మరియు మిడ్-రేంజ్ సెగ్మెంట్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. స్టీల్, సిమెంట్ ధరలు పెరగడం మరియు వడ్డీ రేట్ల భారం వల్ల సామాన్యులకు ఇళ్లు కొనుగోలు చేయడం భారంగా మారింది.
ప్రాంతీయంగా రిస్క్
ఢిల్లీ-NCR మార్కెట్ విషయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ గత తొమ్మిది నెలల్లో సేల్స్ 11% పడిపోయినా, ప్రాపర్టీ ధరలు మాత్రం 12% పెరిగాయి. ధరలను తగ్గించి అమ్మకాలను పెంచుకునే బదులు, డెవలపర్లు ధరలను అలాగే ఉంచుతున్నారు. ఇది భవిష్యత్తులో డిమాండ్ తగ్గితే రిస్క్‌గా మారే అవకాశం ఉంది.
ఇన్వెస్టర్లు ఏం గమనించాలి?
రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం సేల్స్ ఫిగర్స్ మాత్రమే కాకుండా, ఆ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో లగ్జరీ vs ఎఫర్డబుల్ ప్రాజెక్టుల నిష్పత్తిని చూడాలి. అలాగే, డెవలపర్ల అప్పుల భారం, Inventory turnover రేటు మరియు RBI వడ్డీ రేట్ల నిర్ణయాలు ఈ రంగంపై ఎప్పటికప్పుడు ప్రభావం చూపుతాయనేది మర్చిపోవద్దు.
