Income Tax Department కీలక నిర్ణయం తీసుకుంది. 'SAKSHAM NUDGE' పేరుతో సుమారు 12,000 మంది టాక్స్ ప్రొఫెషనల్స్‌ను అలర్ట్ చేసింది. అక్టోబర్ 21 డెడ్ లైన్ లోపు పెండింగ్ ఆడిట్ రిపోర్టులను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ప్రస్తుత అసెస్మెంట్ ఇయర్ (2026-27) కోసం Income Tax Department కంప్లయన్స్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే 'SAKSHAM NUDGE' అనే కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా, ఫామ్ 3CD (Form 3CD) ఆడిట్ రిపోర్టులను సబ్మిట్ చేయడంలో వెనుకబడిన 12,000 మంది టాక్స్ ప్రొఫెషనల్స్‌ను ఈ విభాగం టార్గెట్ చేసింది.
ఎందుకీ హడావిడి?
గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే, సదరు ప్రొఫెషనల్స్ ఈసారి 50% కంటే తక్కువ రిపోర్టులను మాత్రమే ఫైల్ చేశారు. చివరి నిమిషంలో పోర్టల్‌పై భారం పడకుండా ఉండాలని, సిస్టమ్ గ్లిచ్‌లు రాకుండా ముందే జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే ఈ అసెస్మెంట్ సైకిల్లో సుమారు 19.5 లక్షల ఆడిట్ రిపోర్టులు ప్రాసెస్ అయ్యాయని ఐటీ శాఖ వెల్లడించింది.
ఇంపార్టెంట్ డేట్స్
ఆడిట్ రిపోర్టుల కోసం ఇప్పటికే గడువును సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 21, 2026 వరకు పొడిగించారు. ఆ తర్వాత, ఆడిట్ కేసులకు సంబంధించిన ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ గడువు నవంబర్ 21, 2026 కి ముగుస్తుంది. కాబట్టి, ఇన్వెస్టర్లు మరియు బిజినెస్ వర్గాలు ఈ కంప్లయన్స్ అంశాలపై నిశితంగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.
