ఏప్రిల్ 1, 2026 నుంచి Form 26AS పేరు Form 168గా మారింది. ఆదాయపు పన్ను వివరాల్లో తేడాలు వస్తే కంగారు పడాల్సిన పనిలేదు, ఈ మార్పులు మరియు కొత్త నిబంధనలు మీకు రక్షణ కల్పిస్తాయి.
ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను చట్టం, 2025 ప్రకారం.. ఇప్పటివరకు మనం పిలుచుకుంటున్న Form 26AS ఇకపై Form 168 గా మారింది. పేరు మారినా దీని పనితీరులో ఎలాంటి మార్పు లేదు. ఇది మీ ట్యాక్స్ క్రెడిట్స్, TDS, TCS మరియు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులన్నింటినీ కలిపి చూపే ఏకైక స్టేట్‌మెంట్.
సమస్య ఎక్కడ వస్తుంది?
చాలామంది పన్ను చెల్లింపుదారులకు Form 168లో ఉన్న ఆదాయం, వాస్తవంగా చేతికి అందిన ఆదాయంతో సరిపోలడం లేదు. ఇలాంటి తేడాలు రావడానికి ప్రధాన కారణం డెడక్టర్లు (Deductors) చేసే పొరపాట్లే. తప్పు PAN నంబర్ ఎంటర్ చేయడం, TDS రిటర్న్స్‌ని ఆలస్యంగా ఫైల్ చేయడం లేదా తప్పు ఫైనాన్షియల్ ఇయర్ లో ట్రాన్సాక్షన్ చూపించడం వల్ల ఈ గందరగోళం ఏర్పడుతోంది. ఇలాంటి mismatches వస్తే, Section 143(1) లేదా 139(9) కింద నోటీసులు వచ్చే అవకాశం ఉంది.
ITAT తీర్పు ఏమంటోంది?
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇటీవలే Income Tax Appellate Tribunal (ITAT) ఒక కీలక తీర్పునిచ్చింది. Form 168లో ఉన్న ఫిగర్లను ప్రాథమిక ఆధారాలుగా మాత్రమే చూడాలి కానీ, వాటినే ఫైనల్ అని భావించి పన్నులు వేయడానికి వీల్లేదు. ఒకవేళ తేడాలు ఉంటే, ట్యాక్స్ పేయర్ తన దగ్గర ఉన్న బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఇన్‌వాయిస్‌లు లేదా అగ్రిమెంట్లను చూపించి తన పక్షాన వాదించవచ్చు.
పరిష్కారం ఎలా?
- మొదట మీ Form 168ని Annual Information Statement (AIS) తో సరిచూసుకోండి.
- ఎక్కడైనా తేడా ఉంటే, ఎవరైతే TDS కట్ చేశారో ఆ సంస్థను సంప్రదించి, TRACES పోర్టల్ ద్వారా Revised TDS Statement ఫైల్ చేయమని కోరండి.
- ఒకవేళ ఆ సంస్థ స్పందించకపోతే, నేరుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో గ్రీవెన్స్ (Grievance) రైజ్ చేయవచ్చు.
ఈ ప్రక్రియలో మీరు పంపిన మెయిల్స్, డాక్యుమెంట్లు అన్నింటినీ ఒక రికార్డుగా ఉంచుకోవడం ఉత్తమం. ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే జరిమానాలు పడే అవకాశం ఉన్నందున, AIS మరియు Form 168లను క్రమబద్ధంగా మానిటర్ చేయడం చాలా అవసరం.
