అసలు గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి?
చాలామంది క్రెడిట్ కార్డ్ అప్పుల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణం ఈ 'గ్రేస్ పీరియడ్'పై అవగాహన లేకపోవడమే. మీరు మీ మునుపటి బ్యాలెన్స్ మొత్తం చెల్లిస్తేనే బ్యాంకులు వడ్డీని మాఫీ చేస్తాయి. కేవలం మినిమమ్ మొత్తం చెల్లించినప్పుడు, మీరు ఈ ప్రయోజనాన్ని కోల్పోతారు.
దీనివల్ల, మీరు క్యారీ ఫార్వర్డ్ చేసిన మొత్తానికే కాకుండా, కొత్తగా చేసిన కొనుగోళ్లపై కూడా వడ్డీ లెక్కించడం మొదలవుతుంది. అంటే, మీరు రోజూ చేసే చిన్న చిన్న ఖర్చులకు కూడా వాటి అసలు ధర కంటే చాలా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.
