2023లో తన పేరును మార్చుకునేందుకు Drone Federation India సమర్పించిన NOC పత్రాలు నకిలీవని Ministry of Corporate Affairs (MCA) గుర్తించింది. మొదట మోసపూరితమైనవని భావించినప్పటికీ, ప్రస్తుత విచారణ సాంకేతిక ఉల్లంఘనల వైపు మళ్లింది.
Ministry of Corporate Affairs (MCA) ఇప్పుడు Drone Federation Indiaపై కన్నెర్ర చేసింది. 2023లో 'Drone Federation India' పేరును 'Drone Federation of India'గా మార్చుకోవడానికి ఈ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఈ ప్రాసెస్ కోసం Directorate General of Civil Aviation (DGCA) జారీ చేసినట్లుగా ఒక నకిలీ No-Objection Certificate (NOC)ను సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
లోతుల్లోకి వెళ్తే..
విచారణలో ఈ సర్టిఫికేట్ అసలైనది కాదని తేలింది. అందులో లేని ఫైల్ నంబర్లను వాడటం, అప్పటికే పదవీ విరమణ చేసిన అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేయడం వంటివి బయటపడ్డాయి. దీనిపై ఇంటర్నల్ రివ్యూ చేసిన MCA, తొలుత కంపెనీల చట్టం సెక్షన్ 447 మరియు 448 కింద మోసపూరిత చర్యల (Fraud) కోసం కేసులు నమోదు చేయాలని భావించింది.
ప్రస్తుత పరిస్థితి..
ముంబైలోని 37వ కోర్టులో జరుగుతున్న విచారణలో, ఈ సంస్థ డైరెక్టర్లు రాహత్ కులశ్రేష్ఠ, ప్రవీణ్ వినోద్ ప్రజాపతి మరియు విపుల్ సింగ్ లపై ప్రధానంగా రికార్డుల నిర్వహణ, ఫైనాన్షియల్ అకౌంట్ల నిర్వహణలో జరిగిన సాంకేతిక లోపాలపై మాత్రమే కేసులు నడుస్తున్నాయి. మోసపూరిత ఆరోపణలు ఎందుకు లేవన్న దానిపై Central Vigilance Commission (CVC) కి ఫిర్యాదులు అందాయి.
అయితే, ఈ సంస్థ ప్రైవేట్, లాభాపేక్ష లేని బాడీ అని, ఇది స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవ్వలేదని గమనించాలి. కాబట్టి, ఇన్వెస్టర్లపై నేరుగా ప్రభావం ఉండదు. కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఇటువంటి లోపాలు ఎలా జరుగుతాయో తెలియజేసే కేస్‌గా ఇది నిలుస్తోంది.
