మార్కెట్ ర్యాలీని చూసి Flexicap ఫండ్స్ నుండి Smallcap ఫండ్స్‌కు మారాలని చాలామంది ఇన్వెస్టర్లు ఆలోచిస్తుంటారు. కానీ, ఇది రిస్క్‌తో కూడుకున్న పని అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వల్పకాలిక లాభాల కోసం వెంపర్లాడటం కంటే, మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం.
మార్కెట్ ఒక్క ఏడాది బాగా పెరగగానే, చాలామంది ఇన్వెస్టర్లు సురక్షితమైన Flexicap ఫండ్స్ నుండి రిస్క్ ఎక్కువగా ఉండే Smallcap ఫండ్స్‌లోకి మారడానికి ప్రయత్నిస్తారు. కానీ, కేవలం ఒక ఏడాది పనితీరును చూసి మీ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని మార్చుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల 'పెర్ఫార్మెన్స్ ఛేజింగ్' ట్రాప్‌లో పడి, మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఎంట్రీ ఇచ్చే ప్రమాదం ఉంది.
Flexicap ఫండ్స్ ఎందుకు కీలకం?
Flexicap ఫండ్స్ మీకు మార్కెట్ ఒడిదుడుకుల నుండి రక్షణ కల్పిస్తాయి. ఇందులో లార్జ్, మిడ్ మరియు స్మాల్ క్యాప్ షేర్ల మిశ్రమం ఉంటుంది. మార్కెట్ పడిపోయినప్పుడు, లార్జ్ క్యాప్ స్టాక్స్ మీకు ఒక 'కుషన్' లాగా పనిచేసి నష్టాలను తగ్గిస్తాయి. Smallcap ఫండ్స్‌లో ఈ రకమైన స్థిరత్వం ఉండదు.
Smallcap రిస్క్ ఎంతో తెలుసా?
Smallcap ఫండ్స్ అనేవి స్థూల ఆర్థిక పరిస్థితులు (Macroeconomic factors) మరియు లిక్విడిటీ సమస్యలకు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. మార్కెట్ మందగిస్తే, పెద్ద కంపెనీల కంటే చిన్న కంపెనీలే ఎక్కువ నష్టపోయే ఛాన్స్ ఉంది. అందుకే, వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే 7 నుండి 10 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితి ఉండాలి. స్వల్పకాలిక లాభాల కోసం వచ్చే ఇన్వెస్టర్లు మార్కెట్ వోలటాలిటీ పెరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
ఫండ్ మేనేజర్ కేవలం ఇటీవల ఇచ్చిన రిటర్న్స్‌ను మాత్రమే కాకుండా, మార్కెట్ పడిపోయినప్పుడు ఆ ఫండ్ ఎలా రికవర్ అయిందో చూడాలి. ప్రతిసారి ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఫండ్స్ మారడం వల్ల మీరు పాత ఇన్వెస్ట్‌మెంట్‌ను నష్టాల్లో అమ్మేసి, కొత్తవాటిని హై ప్రైస్ దగ్గర కొనే ప్రమాదం ఉంది.
చివరిగా, మీ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని, ఆర్థిక లక్ష్యాలను ఒక్కసారి పునఃసమీక్షించుకోండి. మార్కెట్ ట్రెండ్స్ కన్నా, మీ దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్‌కు ఏది సరిపోతుందో దానికే ప్రాధాన్యత ఇవ్వండి.
