దేశీయ వాణిజ్యానికి ఇంతకీ ఎందుకీ భద్రత?
భారతీయ నౌకా వాణిజ్యం, ఓడలు ఇన్నాళ్లూ ప్రత్యేకమైన ప్రొటెక్షన్ అండ్ ఇండెంనిటీ (P&I) క్లబ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో జరుగుతున్న సంఘర్షణల నేపథ్యంలో, భారత ఓడలు రిస్క్‌కు గురయ్యేవి. దీంతో ఇన్సూరెన్స్ ప్రీమియాలు కొన్ని సందర్భాల్లో రెట్టింపు అయ్యాయి. ఈ పరిస్థితిని మార్చి, వాణిజ్యానికి అండగా నిలిచేందుకే ఈ పూల్ ను తీసుకువచ్చారు.
భారత్ పూల్ ఎలా పనిచేస్తుంది?
ఈ నూతన పథకం కింద, భారత జెండాతో నడిచే ఓడలు, భారతదేశం నుండి బయలుదేరే ఓడలు, అలాగే భారత జలాల్లో ప్రయాణించే ఓడలకు ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ అందించబడుతుంది. థర్డ్-పార్టీ లయబిలిటీస్, కార్గో, ఆపరేషనల్ సమస్యలను ఈ పూల్ కవర్ చేస్తుంది. దీని మేనేజ్‌మెంట్ బాధ్యతలను GIC Re సంస్థ చూసుకోనుంది. ఈ పూల్ గరిష్టంగా $100 మిలియన్ల వరకు క్లెయిమ్ లను కవర్ చేయగలదు.
ప్రభుత్వ గ్యారెంటీతో అదనపు భరోసా
ఈ పథకంలో కీలకమైన అంశం ₹13,000 కోట్ల ప్రభుత్వ హామీ (Sovereign Guarantee). పూల్ పరిధిలోని $100 మిలియన్ల పరిమితిని దాటిన క్లెయిమ్ లకు ఈ హామీ వర్తిస్తుంది. దీని ద్వారా దేశీయ సముద్ర వాణిజ్యాన్ని పెద్ద గ్లోబల్ సంఘటనల నుంచి కాపాడటంతో పాటు, ఈ రంగాన్ని మరింత సురక్షితంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల వివాదాలు, వాణిజ్య అంతరాయాల రిస్క్ తగ్గి, ఓడలకు సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
