రంగం వృద్ధి అంచనాలు
గ్లోబల్ డేటా (GlobalData) రిపోర్ట్ ప్రకారం, భారత జనరల్ ఇన్సూరెన్స్ సెక్టార్ 2026 నుంచి ఏటా సగటున 10% (CAGR) చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా.
ప్రస్తుతం ₹3.6 లక్షల కోట్ల లోపు ఉన్న గ్రాస్ రిటెన్ ప్రీమియమ్స్, 2030 నాటికి ₹5.4 లక్షల కోట్లకు చేరుకుంటాయి.
2025 లో 8.5% వృద్ధి నమోదైనా, 2026 లో అకౌంటింగ్ మార్పులు, జీఎస్టీ అనంతర సాధారణీకరణల వల్ల 5.1% కి తగ్గుముఖం పట్టింది.
అయితే, 2026 తర్వాత ఆర్థిక విస్తరణ, బీమా కవరేజ్ పెరగడంతో వృద్ధి మళ్లీ పుంజుకుంటుందని భావిస్తున్నారు.
హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్ లదే ప్రధాన పాత్ర
జనరల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలలో 72.6% వాటా హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్ లదే.
పర్సనల్ యాక్సిడెంట్ అండ్ హెల్త్ (PA&H) విభాగం 2025 లో 40.9% వాటాతో ( 2021 లో 35.7% ఉండేది) అతిపెద్దదిగా నిలిచింది. 2026 లో ఈ విభాగం 8.8% వృద్ధి సాధిస్తుందని అంచనా.
సెప్టెంబర్ 2025 నుండి రిటైల్ హెల్త్ పాలసీలపై జీఎస్టీని ఎత్తివేయడం వంటి రెగ్యులేటరీ మద్దతు బీమా uptakeను బాగా పెంచింది. అవుట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD), వెల్ నెస్ కవరేజ్ వంటి కొత్త ఆఫర్లను ఇన్సూరర్లు అందిస్తున్నారు.
మోటార్ ఇన్సూరెన్స్ ( 31.7% వాటా) కూడా మారుతోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs) విలువ, వాటి అడ్వాన్స్‌డ్ కాంపోనెంట్స్ వల్ల EV-స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ వృద్ధి చెందుతోంది. యూసేజ్-బేస్డ్ ఇన్సూరెన్స్, టెలిమాటిక్స్-ఆధారిత అండర్ రైటింగ్ పెరుగుతున్నాయి.
పాలసీ సంస్కరణలతో విస్తరణ
2026-2030 మధ్యకాలంలో పాలసీదారుల రక్షణ, వేగవంతమైన క్లెయిమ్స్ పరిష్కారం, విస్తృత క్యాటాస్ట్రోఫిక్ రిస్క్ కవరేజ్ వంటివి వృద్ధికి దోహదం చేస్తాయి.
100% FDI, బలమైన IRDAI అధికారాలు, కాంపోజిట్ లైసెన్సింగ్ వంటి రెగ్యులేటరీ సంస్కరణలు కీలకం.
ఇవి క్యాపిటల్ ఆకర్షించడానికి, ఉత్పత్తి ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, టైర్-II, టైర్-III నగరాలు, MSMEలలో బీమా వ్యాప్తిని పెంచడానికి ఉద్దేశించబడ్డాయి.
మౌలిక సదుపాయాలతో ప్రాపర్టీ ఇన్సూరెన్స్
ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ( 20.2% వాటా) భారీ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతుందని భావిస్తున్నారు.
2026-27 మధ్యకాలంలో మౌలిక సదుపాయాలపై $128.6 బిలియన్ల పెట్టుబడులు, చిన్న నగరాల్లో అభివృద్ధి పెరుగుదలతో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ డిమాండ్ పెరుగుతుంది.
ముఖ్యాంశాలు - రిస్కులు
అయితే, సర్వీస్ క్వాలిటీ సమస్యలు, పెరుగుతున్న కస్టమర్ ఫిర్యాదులు ముఖ్యమైన ఆందోళనలు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాతావరణ సంబంధిత నష్టాలు లాభదాయకతకు ముప్పు కలిగిస్తాయి.
క్యాటాస్ట్రోఫిక్ ఎక్స్పోజర్ రీప్రైసింగ్, పెరుగుతున్న రిపేర్ ఖర్చులు ఇప్పటికే మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ఒత్తిడి తెస్తున్నాయి.
ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ అస్థిరత, మెరైన్, ఏవియేషన్, ట్రాన్సిట్ (MAT) ఇన్సూరెన్స్‌ను ప్రభావితం చేస్తోంది.
