జేసీబీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ శెట్టి మాట్లాడుతూ, 2030 నాటికి భారత్, అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నిర్మాణ పరికరాల మార్కెట్‌గా అవతరించి, చైనాను అధిగమిస్తుందని తెలిపారు. చిన్న కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో జాప్యం కారణంగా 2025 మొదటి 10 నెలల్లో అమ్మకాలు 10% తగ్గాయి. అయితే, వచ్చే సంవత్సరం నుంచి మంచి వర్షపాతం, PMGSY, NHAI వంటి ప్రభుత్వ పథకాల వల్ల గ్రామీణ మార్కెట్ సెంటిమెంట్ బలోపేతం అవ్వడంతో డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని అంచనా.