Evonith Steel ఈ ₹2,000 కోట్ల నిధులను డెట్ (Debt) మరియు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ (NCDs) రూపంలో సమకూర్చుకుంది.
ఈ మొత్తంలో సుమారు ₹1,750 కోట్లను ఇప్పటికే ఉన్న అప్పులను రీఫైనాన్స్ చేయడానికి కేటాయించింది. ఈ వ్యూహాత్మక అడుగుతో కంపెనీకి వడ్డీ ఖర్చులు తగ్గుతాయని, ఆర్థికంగా మరింత పటిష్టత లభిస్తుందని భావిస్తున్నారు.
మిగిలిన ₹250 కోట్లను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కేటాయించారు. వీటిలో ముఖ్యంగా, మహారాష్ట్రలో డక్టైల్ ఐరన్ (DI) పైపుల తయారీ యూనిట్ (సంవత్సరానికి 0.3 మిలియన్ టన్నుల సామర్థ్యం) ఏర్పాటు, అలాగే కోటెడ్ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 0.3 MTPA నుంచి 0.6 MTPAకి రెట్టింపు చేయడం వంటివి ఉన్నాయి.
అలాగే, 0.5 MTPA సామర్థ్యంతో బిల్లెట్ కాస్టర్ (Billet Caster) ను స్థాపించడం ద్వారా హై-క్వాలిటీ లాంగ్ ప్రొడక్ట్స్ రంగంలోకి అడుగుపెట్టనుంది.
కంపెనీ ఛైర్మన్ జై సరాఫ్ మాట్లాడుతూ, 'వడ్డీ ఖర్చులను తగ్గించుకుని, రుణాల గడువును పొడిగించుకోవడం ద్వారా, మేము కార్యకలాపాల మెరుగుదలకు, భవిష్యత్ విస్తరణకు మెరుగైన పెట్టుబడులు పెట్టే స్థితిలో ఉన్నామని' తెలిపారు.
గతంలో, Evonith Steel తన ఐరన్ మరియు స్టీల్ తయారీ సామర్థ్యాన్ని 0.6 MTPA నుంచి 1.4 MTPAకి పెంచడానికి సుమారు ₹1,500 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.
