National Medical Commission (NMC) ఇకపై డాక్టర్లు రిమోట్‌గా మెడికల్ రిపోర్టులను డిజిటల్ సంతకాలతో అథెంటికేట్ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ నిర్ణయం వల్ల డయాగ్నోస్టిక్ రిపోర్టులు త్వరగా అందుబాటులోకి రావడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మరింత వేగవంతం కానున్నాయి.
నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) తీసుకున్న ఈ తాజా నిర్ణయం భారత హెల్త్‌కేర్ రంగంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. ఇప్పటివరకు ల్యాబ్ రిపోర్టులను ధృవీకరించడానికి డాక్టర్లు స్వయంగా హాస్పిటల్ లేదా డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండేది. దీనివల్ల రిపోర్టులు రావడంలో ఆలస్యం జరిగేది. కానీ, ఇప్పుడు సెక్యూర్డ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ల వాడకానికి అనుమతి లభించడంతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయి.
హాస్పిటల్ చైన్స్‌కు భారీ ఊరట
Apollo Hospitals, Dr. Lal PathLabs, Metropolis Healthcare, మరియు Aster DM Healthcare వంటి ప్రముఖ సంస్థలకు ఈ మార్పు పెద్ద ప్లస్ పాయింట్. ఈ సంస్థలు ఇప్పటికే భారీగా PACS మరియు LIS వంటి సాంకేతికతలపై పెట్టుబడి పెట్టాయి. ఇప్పుడు డిజిటల్ సంతకాల వెసులుబాటు ఉండటంతో, సిటీల్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లు రిమోట్‌గా మారుమూల ప్రాంతాల్లోని పేషెంట్ల రిపోర్టులను కూడా క్షణాల్లో పరిశీలించి ధృవీకరించగలరు. ఇది డయాగ్నోస్టిక్ సెంటర్ల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, పేషెంట్లకు తక్కువ సమయంలో రిపోర్టులు అందేలా చేస్తుంది.
బాధ్యత డాక్టర్లదే..
డిజిటల్ విధానం అమలులోకి వచ్చినప్పటికీ, బాధ్యత విషయంలో NMC స్పష్టంగా ఉంది. ఒకవేళ ఆన్‌లైన్‌లో పంపిన డేటా సరిపోకపోతే, పూర్తి వివరాలు సేకరించేవరకు డాక్టర్లు సంతకం చేయకూడదని ఎథిక్స్ & మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డ్ హెచ్చరించింది. అంటే, రిమోట్‌గా సంతకం చేసినా క్లినికల్ జడ్జిమెంట్‌కు సంబంధించి పూర్తి లీగల్ బాధ్యత డాక్టర్లదే.
ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ డిజిటల్ మార్పు వల్ల ఆపరేషనల్ ఖర్చులు తగ్గి, మార్జిన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే, హాస్పిటల్ చైన్స్ సైబర్ సెక్యూరిటీని ఎంత బలంగా మెయింటైన్ చేస్తాయనే దానిపైనే భవిష్యత్తులో ఈ సిస్టం విజయం ఆధారపడి ఉంటుంది.
