ఆదాయంలో వృద్ధి, కానీ లాభాల్లో తగ్గుదల!
Max Healthcare Institute Q3FY26 ఫలితాలు విశ్లేషిస్తే, ఆదాయం విషయంలో గత ఏడాదితో పోలిస్తే 9% వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం ₹2,484 కోట్లకు చేరుకుంది. ఆక్యుపైడ్ బెడ్ కు సగటు ఆదాయం (ARPOB) 3% పెరిగి ₹77,900 కు చేరడం దీనికి ప్రధాన కారణం.
గత క్వార్టర్ తో పోలిస్తే క్షీణత
అయితే, వరుసగా చూసుకుంటే (Sequential basis) మాత్రం పనితీరు కొంత బలహీనపడింది. మునుపటి క్వార్టర్ లో ₹2,580 కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారి తగ్గింది. అలాగే, EBITDA ₹694 కోట్ల నుంచి, నెట్ ప్రాఫిట్ ₹554 కోట్ల నుంచి పడిపోయింది. ముఖ్యంగా, ఆక్యుపెన్సీ రేటు 77% నుంచి 74% కు తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే కూడా 75% నుంచి 74% కు తగ్గింది. దీంతో, EBITDA మార్జిన్లు కూడా 26.4% నుంచి 25.5% కు తగ్గాయి.
కారణాలివే!
కంపెనీ అధికారులు ఈ పనితీరు మందగింపునకు పలు కారణాలను పేర్కొన్నారు. క్యాష్ లెస్ (Cashless) పేమెంట్స్ లో తాత్కాలిక అంతరాయాలు, తక్కువ రీయింబర్స్ మెంట్ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల (PSU) రోగుల సంఖ్య పెరగడం వంటివి ఆదాయంపై ప్రభావం చూపాయి. కొన్ని పేటెంట్ పొందిన కెమోథెరపీ డ్రగ్స్ నిలిపివేయడం కూడా ఒక కారణం. ఇక, CGHS టారిఫ్ హైక్ పూర్తిగా అమలు కావడానికి ఏప్రిల్ 2026 వరకు సమయం పట్టే అవకాశం ఉందని, అప్పటివరకు మార్జిన్ల రికవరీ ఆలస్యం కావచ్చని అంచనా వేస్తున్నారు.
పాజిటివ్ సంకేతాలు, విస్తరణ ప్రణాళికలు
ఈ ఒత్తిడుల మధ్య కూడా, అనుబంధ వ్యాపారాలు (Ancillary businesses) మాత్రం బాగా రాణించాయి. Max@Home ఆదాయం 23% పెరగగా, Max Lab ఆదాయం 13% వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ రోగుల (International patients) నుంచి ఆదాయం కూడా 14% పెరిగి, మొత్తం ఆసుపత్రి ఆదాయాల్లో 9% వాటాను సంపాదించుకుంది. కంపెనీ తన ఆపరేషనల్ బెడ్స్ సంఖ్యను 387 పెంచి, మొత్తం 4,853 బెడ్స్ కు చేర్చింది. ఈ క్వార్టర్ లోనే ₹408 కోట్ల భారీ పెట్టుబడులు (Capex) పెట్టారు. పూణేలో సుమారు 450 బెడ్స్ ఆసుపత్రిని కొనుగోలు చేయడం, మొహాలీ, నానావతి మాక్స్ వంటి చోట్ల బ్రౌన్ ఫీల్డ్ విస్తరణలు దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను బలోపేతం చేస్తున్నాయి.
