కేరళ హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు ఫార్మా రంగంలో సంచలనం సృష్టిస్తోంది. Patents Actలోని సెక్షన్ 100ని ఉపయోగించి, అత్యధిక ధర కలిగిన పేటెంట్ మందులపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
దేశంలో ప్రాణ రక్షక మందుల ధరలను నియంత్రించే విషయంలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో వాడే Abemaciclib, Ribociclib వంటి మందుల ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే హక్కు ఉందని కోర్టు తెలిపింది. పేటెంట్ చట్టంలోని సెక్షన్ 100 కింద ప్రజారోగ్యం దృష్ట్యా మందుల ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి ఉందని కోర్టు స్పష్టం చేసింది.
సెక్షన్ 100 ఏం చెబుతోంది?
సాధారణంగా ఒక కంపెనీకి పేటెంట్ ఉంటే ఆ మందును ఇతరులు తయారు చేయలేరు. కానీ, సెక్షన్ 100 ప్రకారం.. ప్రజారోగ్యం కోసం అవసరమైతే, పేటెంట్ హోల్డర్ అనుమతి లేకుండానే ప్రభుత్వం ఆ మందుల తయారీని చేపట్టవచ్చు. ఇది కేవలం నేషనల్ సెక్యూరిటీ కోసమే కాకుండా, సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో మందులు అందించడానికి కూడా వర్తిస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
ఫార్మా కంపెనీలకు సవాల్
ఈ తీర్పుతో Eli Lilly, Novartis వంటి అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలకు భారీ షాక్ తగిలినట్టే. ఈ కంపెనీలు తమ హై-వాల్యూ క్యాన్సర్ డ్రగ్స్ ద్వారా మంచి మార్జిన్లను పొందుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం డ్రగ్ అఫర్డబిలిటీపై దేశవ్యాప్త సమీక్ష చేపడితే, ఈ కంపెనీల ప్రాఫిట్ మార్జిన్ల మీద తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది.
ఇన్వెస్టర్లు ఏం గమనించాలి?
ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ధరల నియంత్రణ ఉత్తర్వులను జారీ చేయలేదు. అయితే, ప్రభుత్వం డ్రగ్ ధరలను 'అఫోర్డబుల్' కాదని భావిస్తే, భవిష్యత్తులో గట్టి చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ చేపట్టబోయే సమీక్ష, మందుల ధరల నిర్ణయ ప్రక్రియలో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి. ఇది ఫార్మా రంగంలోని ప్రీమియం ప్రొడక్ట్స్ ధరల మోడల్స్‌ను పూర్తిగా మార్చేయవచ్చు.
