GDN వెంచర్స్, గౌడియం IVF లో పెట్టుబడి
GDN Ventures, రాజస్థాన్ కి చెందిన ఒక లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్ (LLP), గౌడియం IVF అండ్ వుమెన్ హెల్త్ లో 10 లక్షల షేర్లను, అంటే సుమారు 1.37% వాటాను ₹8.58 కోట్ల కు కొనుగోలు చేసింది. ఈ కొనుగోలులో ఒక్కో షేర్ ధర ₹85.84 గా ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ తో ఫెర్టిలిటీ కేర్ రంగంలో ఉన్న ఈ కంపెనీ షేర్లు అనూహ్యంగా పుంజుకున్నాయి.
గౌడియం IVF షేర్లలో భారీ పెరుగుదల
ఈ బల్క్ డీల్ వార్త రావడంతో, గౌడియం IVF షేర్లు భారీ ట్రేడింగ్ వాల్యూమ్స్ తో 12.56% జంప్ అయ్యి ₹89.17 వద్ద ట్రేడ్ అయ్యాయి. గత ఫిబ్రవరి 27న మార్కెట్ లో లిస్ట్ అయిన ఈ కంపెనీ, తన ఇష్యూ ప్రైస్ ₹79 నుండి ఇప్పటికే దాదాపు 13% లాభాలను నమోదు చేసుకుంది. దీంతో ఇన్వెస్టర్లలో సంతోషం వెల్లివిరుస్తోంది.
ఏప్రిల్ 9 నాటి ఇతర బల్క్ డీల్స్
ఏప్రిల్ 9వ తేదీన జరిగిన ట్రేడింగ్ లో మరికొన్ని ముఖ్యమైన బల్క్ డీల్స్ కూడా నమోదయ్యాయి. ఫార్మా రంగంలో ఉన్న Sai Parenterals కంపెనీలో Arihant Capital Markets, 0.9% వాటాను ₹16.84 కోట్ల కు కొనుగోలు చేసింది. Trendview Capital Fund, Striders Impex మరియు Marushika Technology కంపెనీలలో తన షేర్లను అమ్మకానికి పెట్టింది. అలాగే, Minerva Ventures Fund, Expo Engineering and Projects లో వాటాను చేజిక్కించుకోగా, Niraalie Meynon తన హోల్డింగ్స్ ను విక్రయించింది. అయితే, గౌడియం IVF డీల్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.