అసలు సంగతేంటి?
Fullife Healthcare, Elev8 మరియు దాని అనుబంధ సంస్థల నుంచి ₹300 కోట్ల నిధులను విజయవంతంగా సేకరించింది. ఈ ఫండింగ్‌లో కంపెనీ కోసం ₹150 కోట్ల కొత్త ఈక్విటీ (New Equity) మరియు ప్రస్తుత వాటాదారులకు లిక్విడిటీని అందించేందుకు ₹150 కోట్ల సెకండరీ పర్చేజ్‌లు (Secondary Purchases) ఉన్నాయి.
మార్కెట్లో లీడింగ్ పొజిషన్ మరింత పటిష్టం..
ఈ పెట్టుబడి, భారతదేశ ఎఫర్వెస్సెంట్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ మార్కెట్లో Fullife Healthcare యొక్క అగ్రగామి స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఇప్పటికే ఈ కంపెనీ ఎఫర్వెస్సెంట్ ఉత్పత్తుల తయారీ మరియు సరఫరాలో దేశంలోనే అతిపెద్దదిగా కొనసాగుతోంది. ఈ నిధులను కంపెనీ విస్తరణ ప్రణాళికలు, కొత్త ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధి (R&D) మరియు మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి ఉపయోగించనున్నారు.
డీల్ వెనుక లీగల్ సపోర్ట్..
ఈ కీలకమైన లావాదేవీలో Fullife Healthcareకు Khaitan & Co న్యాయ సలహాదారుగా వ్యవహరించింది. ఒప్పందాల సమీక్ష, చర్చలు, మరియు డీల్ పూర్తి చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది.