9 నెలల పనితీరుతో అంచనాలను అధిగమించిన CORONA Remedies
కేవలం Q3 ఫలితాలే కాదు, ఈ ఏడాది తొమ్మిది నెలల (9M FY'26) పనితీరు కూడా అద్భుతం. ఈ తొమ్మిది నెలల్లో కంపెనీ ఆదాయం 16% పెరిగి ₹1,050 కోట్లకు చేరింది. ఇది కంపెనీ ఇచ్చిన 15% గ్రోత్ గైడెన్స్ ను కూడా అధిగమించింది. ఇక లాభాల విషయానికొస్తే, 9M FY'26 లో EBITDA 25% పెరిగి ₹231 కోట్లకు, సర్దుబాటు చేసిన PAT (Adjusted PAT) 31% పెరిగి ₹154 కోట్లకు చేరాయి. కంపెనీ మార్గదర్శకాలను 20% PAT గ్రోత్ గా ఇవ్వగా, 31% గ్రోత్ సాధించి అంచనాలను తలకిందులు చేసింది.
మార్జిన్లు, లాభదాయకతపై ఫోకస్
Q3 FY'26 లో EBITDA 20% పెరిగి ₹83 కోట్లకు చేరుకుంది, EBITDA మార్జిన్లు 100 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 24.3% కి చేరాయి. ఈ కాలంలో కంపెనీ నికర లాభం (PAT) 24% పెరిగి ₹56 కోట్లకు నమోదైంది. కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ కూడా చాలా బలంగా ఉంది. 9M FY'26 కి వార్షిక రిటర్న్ ఆన్ ఈక్విటీ (ROE) 31% గా, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ (ROCE) 48% గా ఉంది. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో (OCF) టు EBITDA కన్వర్షన్ రేటు 86% గా నమోదవ్వడం, కంపెనీ నెట్ క్యాష్ సర్ ప్లస్ లో ఉందని సూచిస్తోంది.
మార్కెట్ వాటా, వ్యూహాత్మక అడుగులు
ఇండియన్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ (IPM) తో పోలిస్తే CORONA Remedies 18.9% గ్రోత్ సాధించి, మార్కెట్ వాటాలో రెండు ర్యాంకులు పైకి ఎక్కింది. ఈ గ్రోత్ కి ప్రధాన కారణం బేయర్ (Bayer) పోర్ట్ ఫోలియో కొనుగోలు, కొత్త ప్రోడక్ట్ లాంచెస్. ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడం వల్ల ఖర్చులు పెరిగినా, దీర్ఘకాలంలో మార్జిన్లను పెంచడమే లక్ష్యమని మేనేజ్మెంట్ తెలిపింది.
భవిష్యత్ ప్రణాళికలు, అవుట్లుక్
మేనేజ్మెంట్ తమ వార్షిక గైడెన్స్ ను 15% రెవెన్యూ గ్రోత్, 20% PAT గ్రోత్ గా పునరుద్ఘాటించింది. రాబోయే కాలంలో క్రోనిక్, సెమీ-క్రోనిక్ థెరపీలలో మార్కెట్ వాటాను పెంచుకోవడం, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం ప్రధానంగా ఉంటాయి. Q4 FY'26 లో బేయర్ నుండి కొనుగోలు చేసిన పోర్ట్ ఫోలియోలో భాగంగా 'Noklot Plus' లాంచ్ అవుతుంది. అలాగే, EAEU GMP అక్రిడిటేషన్ తో USD 25 బిలియన్ మార్కెట్ లోకి ప్రవేశం, మార్చి 2026 లో 'Wyntide' అనే GLP-1 ఇంజెక్టబుల్ లాంచ్, FY'28-FY'29 నాటికి కొత్త ప్లాంట్ నిర్మాణం వంటివి భవిష్యత్ వృద్ధికి దోహదపడతాయి. మరో రెండు బ్రాండ్ల కొనుగోలును కూడా పరిశీలిస్తున్నారు.