ఈ బైబ్యాక్ ఎందుకు ముఖ్యం?
Aurobindo Pharma తమ వాటాదారులకు రిటర్న్స్ పెంచడమే కాకుండా, ఎర్నింగ్స్ పర్ షేర్ (EPS), రిటర్న్ ఆన్ నెట్ వర్త్ (Return on Net Worth), రిటర్న్ ఆన్ అసెట్స్ (Return on Assets) వంటి కీలక ఆర్థిక కొలమానాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా, కంపెనీ మేనేజ్‌మెంట్ తమ షేర్లు ప్రస్తుత మార్కెట్ లో undervalue అయ్యాయని భావిస్తున్నట్టుగా ఈ బైబ్యాక్ ప్రకటన సూచిస్తోంది. ₹800 కోట్లతో షేర్లను వెనక్కి తీసుకోవడం, ప్రస్తుత ట్రేడింగ్ ధర కంటే ప్రీమియం వద్ద జరగడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. మార్కెట్ లో ఫార్మా రంగం P/E సుమారు 32.46 ఉండగా, Aurobindo Pharma P/E మాత్రం 22-23 మధ్య ఉంది. ఇది కాస్త తక్కువగానే పరిగణిస్తున్నారు.
ఈ బైబ్యాక్ లో భాగంగా, కంపెనీ 54.23 లక్షల షేర్లను ఒక్కోటి ₹1,475 చొప్పున కొనుగోలు చేస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 23 నుండి ఏప్రిల్ 29 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹80,000 కోట్లకు పైగా ఉన్న ఈ కంపెనీకి, ఈ బైబ్యాక్ పరిమాణం మొత్తం ఈక్విటీలో 3.93% (స్టాండ్ అలోన్ బేసిస్) మరియు 2.62% (కన్సాలిడేటెడ్ బేసిస్) గా ఉంది.
భారత ఫార్మా రంగం బలం, Aurobindo పాత్ర
భారత ఫార్మా రంగం మంచి రెసిలియెన్స్ చూపిస్తోంది. FY26 నాటికి 7-9% రెవెన్యూ గ్రోత్ ఉంటుందని అంచనా. Aurobindo Pharma యూఎస్, యూరప్ మార్కెట్లలో బలమైన ఉనికిని కలిగి ఉంది, ఇది ఈ ట్రెండ్స్ నుండి ప్రయోజనం పొందడానికి దోహదం చేస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు (Year-to-date) Aurobindo Pharma స్టాక్ ఇప్పటికే 16.3% పెరిగింది. అయితే, మార్కెట్ నిపుణులు ప్రస్తుత ధరల వద్ద పెద్దగా అప్ సైడ్ పొటెన్షియల్ లేదని, సుమారు 0.44% మాత్రమే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
సవాళ్లు, రిస్కులు
యూఎస్ మార్కెట్ లో పెరుగుతున్న నియంత్రణపరమైన అనిశ్చితులు, అధిక పెట్టుబడులు మార్జిన్లపై ప్రభావం చూపవచ్చు. కంపెనీ గతంలో అమ్మకాల వృద్ధిలో మందగమనం, తక్కువ డివిడెండ్ పే అవుట్ రేషియో వంటి సవాళ్లను ఎదుర్కొంది. రాబోయే రోజుల్లో కీలక మార్కెట్లలో మార్జిన్ ఒత్తిళ్లను, నియంత్రణ వాతావరణాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం కంపెనీ విజయానికి కీలకం.
