ఇండస్ట్రియల్ సైట్స్ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మైనింగ్, పోర్టులు, రైల్ యార్డులకు మొబైల్ యూనిట్ల ద్వారా CNG మరియు బయో గ్యాస్ సరఫరా చేసేందుకు అనుమతులు లభించాయి.
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ తాజాగా తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రియల్ సెక్టార్‌లో కీలక మార్పులకు నాంది పలుకుతోంది. ఇప్పటివరకు భారీ పరిశ్రమలు, మైనింగ్ ప్రాంతాలు లేదా పోర్టులకు గ్యాస్ అందాలంటే ఫిక్స్‌డ్ స్టేషన్లపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇకపై మొబైల్ రీఫ్యూయలింగ్ యూనిట్ల ద్వారా నేరుగా ఇండస్ట్రియల్ సైట్లకు CNG మరియు కంప్రెస్డ్ బయో గ్యాస్‌ని చేరవేసే వెసులుబాటు కల్పించారు.
కంపెనీలకు కలిగే ప్రయోజనం ఏంటి?
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఇది ఒక పెద్ద ఊరట. గతంలో ఒక ప్రాంతంలో పెర్మనెంట్ ఫిల్లింగ్ స్టేషన్ కట్టాలంటే భారీ ఖర్చుతో పాటు, భవిష్యత్తులో డిమాండ్ ఎలా ఉంటుందో అన్న సందిగ్ధత ఉండేది. ఇప్పుడు మొబైల్ యూనిట్ల వల్ల తక్కువ ఖర్చుతోనే, ఆయా సైట్లలో డిమాండ్‌ని పరీక్షించి, అవసరమైతే కస్టమర్ బేస్‌ను పెంచుకునే అవకాశం లభిస్తుంది.
ప్రభుత్వ నిబంధనలు (Safety Protocols)
ఈ మొబైల్ యూనిట్ల వినియోగంపై ప్రభుత్వం కఠినమైన నిబంధనలు కూడా విధించింది. వీటిని కేవలం పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వాడాలి, పబ్లిక్ రీటైల్ లేదా రోడ్డు పక్కన అమ్మకాలకు అనుమతి లేదు. ఆపరేటింగ్ ప్రెజర్ 250 బార్ మించకూడదని, అత్యవసర సమయాల్లో ఆటోమేటిక్ షట్-ఆఫ్ వాల్వ్స్ ఉండాలని నిబంధనల్లో స్పష్టం చేశారు.
ఇన్వెస్టర్లకు సూచన
ఈ నిర్ణయం వల్ల పారిశ్రామికంగా గ్యాస్ వాడకం పెరిగే అవకాశం ఉంది. డీజిల్ నుండి క్లీన్ ఫ్యూయల్‌కు మారాలనుకునే కంపెనీలకు ఇది ఒక గొప్ప అవకాశం. ఏ ఏ సిటీ గ్యాస్ కంపెనీలు ఈ మొబైల్ యూనిట్లను వేగంగా అందుబాటులోకి తెస్తాయో, వాటిపైనే రాబోయే క్వార్టర్లలో వాల్యూమ్ గ్రోత్ ఆధారపడి ఉంటుంది.
