కొంతకాలంగా లాభాల్లో దూసుకుపోతున్న Nifty 50 మరియు Sensex ఈరోజు కాస్త వెనక్కి తగ్గాయి. IT, PSU బ్యాంక్, ఆయిల్ రంగాల్లో భారీగా అమ్మకాలు జరగడంతో సూచీలు నష్టపోయాయి. మార్కెట్ బలహీనంగా ఉండటంతో ఏకంగా 100కు పైగా స్టాక్స్ తమ 52-వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.
గత నాలుగు రోజులుగా మార్కెట్‌లో కనిపిస్తున్న జోరుకు మంగళవారం బ్రేక్ పడింది. కీలక రంగాల్లో లాభాల స్వీకరణ (Profit booking) కారణంగా Nifty 50 85.3 పాయింట్లు నష్టపోయి 23,329 వద్ద, Sensex 329.91 పాయింట్లు కోల్పోయి 74,529.08 వద్ద స్థిరపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మద్దతు ఉన్నప్పటికీ, ప్రధానంగా IT రంగం 1 శాతం వరకు పడిపోవడం ఇండెక్స్ పై ప్రభావం చూపింది.
రంగాల వారీగా పెర్ఫార్మెన్స్
మార్కెట్ మొత్తం నెగిటివ్ గా ఉన్నప్పటికీ, కొన్ని రంగాల్లో మాత్రం పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. మీడియా, రియల్టీ రంగాలు 1 శాతం మరియు 0.9 శాతం లాభపడ్డాయి. మరోవైపు FMCG, ఫార్మా, ఆయిల్ & గ్యాస్ రంగాలు 0.5 శాతం మేర నష్టపోయాయి. రూపాయి విలువ కూడా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 22 పైసలు బలహీనపడి 95.59 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడ్ ధరలు $100 కంటే తగ్గినా, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మాత్రం జాగ్రత్తగానే ఉంది.
స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్
Nifty ఇండెక్స్ పై Tata Consumer Products, Bajaj Finance షేర్లు ఒత్తిడి పెంచాయి. Coal India, Dr. Reddy’s Labs షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. Jefferies నుండి 'Hold' రేటింగ్ రావడంతో Blue Star షేరు 2 శాతం పతనమైంది. అదే సమయంలో, 4.97 కోట్ల షేర్ల బ్లాక్ డీల్ నేపథ్యంలో Pine Labs షేర్ 5 శాతం పెరిగింది. అలాగే Transrail Lighting 15 శాతం, Pace Digitek 9 శాతం లాభపడ్డాయి. మార్కెట్‌లో వస్తున్న ఈ హెచ్చుతగ్గులు మరికొన్ని రోజులు కొనసాగుతాయా లేదా అనేది చూడాలి.
