National Statistical Office (NSO) విడుదల చేసిన తాజా 'Periodic Labour Force Survey 2025' నివేదిక దేశవ్యాప్తంగా నిరుద్యోగిత, విద్యా పరిస్థితులపై కీలక విషయాలను బయటపెట్టింది. చదువు, ఉద్యోగం లేదా శిక్షణలో లేని యువత (NEET) శాతం కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకరంగా ఉంది.
National Statistical Office (NSO) అందించిన లేటెస్ట్ డిస్ట్రిక్ట్-లెవల్ డేటా ప్రకారం, భారత యువత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యంపై ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. NEET (Not in Education, Employment, or Training) విభాగంలోకి చేరుతున్న వారి సంఖ్య పెరగడం, ఆర్థిక వృద్ధికి ఒక సవాలుగా మారింది.
కోచింగ్ హబ్స్ ఎఫెక్ట్
ఈ సర్వేలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం నార్త్ ఢిల్లీ గణాంకాలు. అక్కడ NEET రేట్ 44.3% గా ఉంది. దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్న కోచింగ్ సెంటర్లు. సివిల్ సర్వీస్, ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం చదువుతున్న యువత ఎక్కువగా ఉండటంతో, వారు తాత్కాలికంగా వర్క్ ఫోర్స్ కి దూరంగా ఉంటున్నారు. ఇది ప్రైవేట్ రంగంలో టాలెంట్ హంటింగ్‌పై ప్రభావం చూపుతోంది.
బీహార్, తెలంగాణలో అసలు సవాలు
కోచింగ్ హబ్స్ ప్రభావం ఒక ఎత్తైతే, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. బీహార్‌లోని పశ్చిమ చంపారణ్‌లో NEET రేట్ 43.6% గా ఉండగా, రాష్ట్ర సగటు 32.1% గా నమోదైంది. ఇక్కడ సమస్య చదువు కాదు, స్థానికంగా ఉద్యోగాల కల్పన లేకపోవడం. అలాగే తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 42.7% NEET రేటు ఉండటం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలను సూచిస్తోంది.
ఉత్పాదకతపై ప్రభావం
విద్యా వ్యవస్థకు, మార్కెట్ అవసరాలకు మధ్య ఉన్న గ్యాప్ ఈ నివేదికతో స్పష్టమవుతోంది. భారీ సంఖ్యలో యువత శిక్షణ లేదా ఉద్యోగం లేకుండా ఉండటం వల్ల దేశ 'డెమోగ్రాఫిక్ డివిడెండ్' (Demographic Dividend) వృథా అయ్యే ప్రమాదం ఉంది. పరిశ్రమలకు కావాల్సిన స్కిల్డ్ లేబర్ దొరకకపోవడం వల్ల కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అంతేకాకుండా, ఈ యువతకు సంపాదన లేకపోవడం వల్ల అది కన్స్యూమర్ డిమాండ్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
