భారతదేశంలో డీప్-టెక్ స్టార్టప్‌లకు నిధుల సమకూర్చడంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్ల వంటి రంగాలకు సాఫ్ట్‌వేర్ సంస్థల తరహా కొలమానాలు సరిపోవని గుర్తించిన ప్రభుత్వం, కొత్త గవర్నెన్స్ పాలసీలపై దృష్టి సారించింది.
ప్రస్తుతం ఉన్న ట్రెడిషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీల వలె డీప్-టెక్ సంస్థలను కేవలం క్వార్టర్లీ రెవెన్యూ లేదా షార్ట్-టర్మ్ గ్రోత్ ఆధారంగా అంచనా వేయడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్ వంటి రంగాల్లో పరిశోధన పూర్తి కావడానికి సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే, ఈ రంగాలకు 'పేషెంట్ క్యాపిటల్' (Patient Capital) అవసరమని నిపుణులు చెబుతున్నారు.
భారీ నిధులు - కొత్త పథకాలు
ఈ గ్యాప్‌ని భర్తీ చేయడానికి ప్రభుత్వం ₹1 లక్ష కోట్ల విలువైన 'రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్' స్కీమ్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఇది 6 ఏళ్ల కాలపరిమితితో హై-రిస్క్ ప్రాజెక్టులకు మద్దతునిస్తుంది. అలాగే, టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (Technology Development Board) ద్వారా 15 ఏళ్ల కాలపరిమితి కలిగిన కొలేటరల్-ఫ్రీ రుణాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
పారదర్శకతకు పెద్దపీట
'Startup India Fund of Funds 2.0' ద్వారా నిధులు పెరుగుతున్న తరుణంలో, పారదర్శకతపై చర్చ మొదలైంది. ఫండింగ్ నిర్ణయాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా చూడటానికి కఠినమైన 'కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' నిబంధనలను తీసుకురాబోతున్నారు.
ఇకపై:
- ఎవల్యూషన్ ప్యానెల్స్ తరచుగా మారుస్తారు.
- టెక్నికల్ అసెస్‌మెంట్స్ మరియు కమర్షియల్ అసెస్‌మెంట్స్‌ను విడదీస్తారు.
- నిర్ణయాలు తీసుకునే వారు తమ గత సంబంధాలను, బోర్డు పొజిషన్లను వెల్లడించడం తప్పనిసరి.
ఈ నిబంధనల వల్ల భవిష్యత్తులో వచ్చే వైఫల్యాలు ప్రాజెక్ట్ లోపాలతోనే తప్ప, గవర్నెన్స్ లోపాల వల్ల ఉండకూడదని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త విధానాలు భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఎలాంటి మార్పులు తీసుకువస్తాయో వేచి చూడాలి.
