ఆదాయంలో మార్పులు
ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు వాడిన యూనిట్ల ఆధారంగా ఉండేవి. దీనివల్ల Discoms తమ ఆర్థిక ఇబ్బందులను కప్పిపుచ్చుకునేవి. కానీ ఇప్పుడు, CEA ప్రతిపాదనల ప్రకారం, మౌలిక సదుపాయాల ఖర్చులను వేరు చేసి, వాడిన యూనిట్లతో సంబంధం లేకుండా ఫిక్స్‌డ్ ఛార్జీలను వసూలు చేయాలని చూస్తున్నారు. దీనివల్ల వినియోగం ఎలా ఉన్నా, స్థిరమైన ఆదాయం Discoms కు వస్తుంది.
పరిశ్రమలకు భారం
గృహ, వ్యవసాయ రంగాలతో పోలిస్తే, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై ఈ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాబోయే 5 ఏళ్లలో, మౌలిక సదుపాయాల ఖర్చులో 100% ఫిక్స్‌డ్ ఛార్జీలను వసూలు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. తయారీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలు వంటివి విద్యుత్ పై ఎక్కువగా ఆధారపడే రంగాల్లో నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. దీంతో, వాడిన దానికే కాకుండా, అందుబాటులో ఉన్న విద్యుత్ సామర్థ్యానికి కూడా చెల్లించాల్సి వస్తుంది.
రూఫ్‌టాప్ సోలార్‌తో సమస్య
ప్రభుత్వం విద్యుత్ రంగంలో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహిస్తున్నా, మరోవైపు Discoms ఆదాయానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇళ్లు, వ్యాపార సంస్థలు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడంతో, Discoms ఆదాయం తగ్గుతోంది. దీన్ని అధిగమించడానికి, టైమ్-ఆఫ్-డే టారిఫ్‌లు, నెట్ మీటరింగ్ వినియోగదారులకు ప్రత్యేక ఫిక్స్‌డ్ ఛార్జీలను ప్రతిపాదించారు. ప్రస్తుత నెట్ మీటరింగ్ విధానం ఫిక్స్‌డ్ ఖర్చుల వసూళ్లకు ఆటంకంగా మారిందని, అందుకే ఈ మార్పులు అవసరమని regulator అభిప్రాయపడుతున్నారు.
వ్యవస్థాగత బలహీనతలు
ఈ సంస్కరణలు Discoms ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే అవకాశం ఉన్నప్పటికీ, సామాజిక, రాజకీయ వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. విద్యుత్ అనేది రాజ్యాంగంలోని 'concurrent subject' కావడం వల్ల, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత నియంత్రణ సంస్థల ద్వారా populist ధరలను ప్రోత్సహించవచ్చు. రాష్ట్రాలు ఈ ఛార్జీల పెంపును అమలు చేయడంలో విఫలమైతే, విద్యుత్ రంగంలో అప్పులు పెరిగిపోతూనే ఉంటాయి. దీంతో, ప్రభుత్వాలు మళ్ళీ బెయిల్ అవుట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా, ఫిక్స్‌డ్ ఛార్జీల పెంపు వల్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, విద్యుత్ దొంగతనాలు పెరిగే ప్రమాదం ఉంది.
