Ministry of Statistics and Programme Implementation (MoSPI) దేశ GDP గణన పద్ధతిలో మార్పులు చేస్తోంది. ఇకపై రాష్ట్ర స్థాయి వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులను మరింత ఖచ్చితంగా లెక్కించేలా ఎక్స్‌పెండిచర్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయనుంది.
ఆర్థిక వృద్ధిని అంచనా వేసే విధానంలో Ministry of Statistics and Programme Implementation (MoSPI) భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఉత్పత్తి ఆధారంగా (Production output) లెక్కించిన గణాంకాలను పక్కన పెట్టి, రాష్ట్రాల వారీగా ఖర్చుల ఆధారంగా (Expenditure-based) ఆర్థిక కార్యకలాపాలను ట్రాక్ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వ వ్యయం, ప్రైవేట్ పెట్టుబడులు, గృహ వినియోగం వేర్వేరుగా తెలిసి, అసలైన గ్రోత్ డ్రైవర్లు ఎవరో స్పష్టంగా అర్థమవుతుంది.
డేటాలో పారదర్శకత
గతంలో ఆర్థిక గణాంకాలపై IMF లేవనెత్తిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. ఇప్పటికే ఫిబ్రవరి 2026లో ప్రభుత్వం 2022-23ని కొత్త బేస్ ఇయర్‌గా స్వీకరించింది. ఇప్పుడు GST రికార్డులు, Vahan పోర్టల్ డేటా, RBI పర్సనల్ లోన్ గణాంకాలు, Central Electricity Authority అందించే ఎనర్జీ వినియోగం వంటి రియల్ టైమ్ డేటాను జోడించడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మరింత వేగంగా అంచనా వేయనున్నారు.
ఇన్వెస్టర్లు గమనించాల్సింది ఏంటి?
ఇది నేరుగా స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను మార్చే అంశం కాకపోయినా, దేశ స్థూల ఆర్థిక ఆరోగ్యాన్ని (Macro-economic health) అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. ప్రభుత్వ రంగ వ్యయానికి, ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలియడం వల్ల.. డిమాండ్ ఎంత బలంగా ఉందో ఇన్వెస్టర్లు గుర్తించవచ్చు.
అయితే, GDP నంబర్లు పెరిగినంత మాత్రాన కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా అదే స్థాయిలో పెరుగుతాయని చెప్పలేం. ప్రాఫిట్ మార్జిన్లు, ముడి సరుకుల ధరలు, గ్లోబల్ డిమాండ్ వంటి అంశాలు కార్పొరేట్ లాభాలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. రాబోయే కాలంలో ఈ డేటా విధానం ప్రభుత్వ పాలసీ నిర్ణయాలను, వడ్డీ రేట్ల నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
