ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది కేవలం ఒక టెక్నాలజీ ఫీచర్ మాత్రమే కాదు, అది ఇప్పుడు భారతీయ కంపెనీలకు ఒక ప్రధాన రిస్క్. ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగాల్లో AIని బోర్డ్ లెవల్ నుంచి పర్యవేక్షించడం ఇన్వెస్టర్లకు చాలా కీలకం.
కార్పొరేట్ ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర పూర్తిగా మారిపోయింది. గతంలో AIని కేవలం టెక్నికల్ టీమ్స్ చూసుకునేవి, కానీ ఇప్పుడు ఇది బిజినెస్ గమనాన్ని శాసిస్తోంది. లోన్ అప్రూవల్స్, ఫ్రాడ్ డిటెక్షన్ వంటి కీలక నిర్ణయాల్లో AI ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, ఇది కేవలం CTO ఆఫీసుకి పరిమితం కాకుండా, నేరుగా కంపెనీ బోర్డుల పర్యవేక్షణలోకి రావాల్సిన అవసరం ఏర్పడింది.
ఇన్వెస్టర్లు ఎందుకు జాగ్రత్తపడాలి?
AI సిస్టమ్స్‌ను బోర్డ్ లెవల్ గవర్నెన్స్ లేకపోతే కంపెనీలకు భారీ ముప్పు వాటిల్లుతుంది. ఒక చిన్న డేటా తప్పు లేదా అల్గారిథం నిర్ణయం వల్ల కంపెనీల రెప్యుటేషన్ దెబ్బతినడమే కాకుండా, పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ లాస్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా BFSI సెక్టార్‌లో డెసిషన్ మేకింగ్ అంతా ఆటోమేటెడ్ కాబట్టి, ఇక్కడ రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుంది.
ఆర్‌బీఐ (RBI) హెచ్చరికలు
భారతదేశంలో రెగ్యులేటర్లు కూడా AIపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఫెయిర్‌నెస్ (Fairness), ఎక్స్‌ప్లైనబిలిటీ మరియు కంటిన్యూయస్ మానిటరింగ్ తప్పనిసరి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, AI సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయో నిరంతరం మానిటర్ చేయాల్సిందే.
గవర్నెన్స్ లోపం - భారీ నష్టం
చాలా కంపెనీలు గవర్నెన్స్‌ను ఒక అడ్డంకిగా భావిస్తాయి, కానీ అది పెద్ద తప్పు. సిస్టమ్ డిజైన్ దశలోనే సెక్యూరిటీని పొందుపరచకపోతే, తర్వాత మార్పులు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇన్వెస్టర్లు కంపెనీల వార్షిక నివేదికలను పరిశీలించేటప్పుడు, టెక్నాలజీ సామర్థ్యాల కంటే.. వారి గవర్నెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, బోర్డు లెవల్‌లో బాధ్యత ఎవరిది అనే విషయాలపై దృష్టి పెట్టడం ఉత్తమం.
