BRICS కూటమి కీలకమైన 'గ్లోబల్ వాల్యూ చైన్స్ యాక్షన్ ప్లాన్ 2026-2030'ని ప్రకటించింది. సభ్య దేశాల్లోనే ఖనిజాల ప్రాసెసింగ్ పెంచడం ద్వారా గ్లోబల్ డిపెండెన్సీని తగ్గించుకోవాలని ఈ కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. మైనింగ్, బ్యాటరీ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లోని ఇన్వెస్టర్లకు ఇది కీలకం కానుంది.
న్యూఢిల్లీలో జరిగిన 18వ సమ్మిట్లో BRICS సభ్య దేశాలు 'న్యూఢిల్లీ డిక్లరేషన్'ని ఆమోదించాయి. దీని ముఖ్య ఉద్దేశం.. కేవలం ముడి ఖనిజాలను ఎగుమతి చేయడమే కాకుండా, సభ్య దేశాల పరిధిలోనే వాటిని ప్రాసెస్ చేసి, విలువను జోడించడం (Value Addition).
యాక్షన్ ప్లాన్ హైలైట్స్
2026 నుంచి 2030 వరకు అమలు కానున్న ఈ యాక్షన్ ప్లాన్, మొత్తం 11 సభ్య దేశాలను ఒక బలమైన పారిశ్రామిక నెట్‌వర్క్‌గా మార్చనుంది. ఇందులో ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు మరియు బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్‌కు కావాల్సిన ఖనిజాలపై ఫోకస్ పెట్టారు.
ఇన్వెస్టర్లు గమనించాల్సింది ఏంటి?
భారతీయ కంపెనీలు ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఎనర్జీ స్టోరేజ్ కోసం విదేశీ ముడిసరుకులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇప్పుడు ఈ విధానం అమలులోకి వస్తే, సరఫరా గొలుసు (Supply Chain) మెరుగుపడి, కంపెనీల ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్లపై ఆధారపడకుండా, స్థానిక కరెన్సీలను వాడటంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
సవాళ్లు మరియు భవిష్యత్తు
ఈ ప్రణాళిక మంచిదే అయినా, 11 దేశాల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఆసక్తి వేర్వేరుగా ఉండటం వల్ల దీన్ని అమలు చేయడం ఒక సవాలుగా మారనుంది. ఇది స్వచ్ఛంద నిర్ణయం కావడంతో, ప్రతి దేశం తన స్వంత పాలసీలను ఈ ప్లాన్‌కు అనుగుణంగా ఎలా మారుస్తుందనేదే అసలైన టెస్ట్. రాబోయే రోజుల్లో ప్రతి దేశం విడుదల చేసే రోడ్‌మ్యాప్, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచాలి.
