కేంద్రం 8వ సెంట్రల్ పే కమిషన్ (8th CPC) ను నోటిఫై చేసి, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అయితే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ & వర్కర్స్ కాన్ఫెడరేషన్ వంటి ఉద్యోగ సంఘాలు, నిబంధనలు (ToR) పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. 69 లక్షల మంది పెన్షనర్లకు పెన్షన్ సవరణలో స్పష్టత లేదని, 'అన్ ఫండెడ్ కాస్ట్' అనే పదాన్ని తొలగించాలని, పాత, కొత్త పెన్షన్ పథకాలకు నిర్దిష్ట ప్రస్తావనలు చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి.