రికార్డు స్థాయిలో ఉత్పత్తి.. భవిష్యత్ లక్ష్యాలకు ఊపు!
KSDL సాధించిన ఈ అద్భుతమైన ఉత్పత్తి గణాంకాలను రాష్ట్ర భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎం.బి. పాటిల్ వెల్లడించారు. కేవలం జనవరి 2026 నెలలోనే, కంపెనీ 3,798 మెట్రిక్ టన్నుల సబ్బులను, 941 మెట్రిక్ టన్నుల డిటర్జెంట్లను, అలాగే 155 మెట్రిక్ టన్నుల కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేసింది. ఇది కేవలం ఒక నెల పనితీరు మాత్రమే కాదు. గతంలో డిసెంబర్ 2025లో 4,735 మెట్రిక్ టన్నులు, మార్చి 2025లో 4,486 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితోనూ KSDL తన మునుపటి రికార్డులను అధిగమించింది.
మార్కెట్ విస్తరణపై ప్రత్యేక దృష్టి!
KSDL తన వ్యాపారాన్ని సంప్రదాయ మార్కెట్లకు పరిమితం చేయకుండా, దేశవ్యాప్తంగా విస్తరించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు, విదేశీ మార్కెట్లలోనూ అమ్మకాలను పెంచుకునేందుకు బ్రాండింగ్, సేల్స్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేస్తోంది. దశాబ్దం చివర నాటికి ₹5,000 కోట్ల టర్నోవర్ అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ వ్యూహాత్మక విస్తరణ ఎంతగానో దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది.
కొత్త ఉత్పత్తులతో మార్కెట్ లోకి..
ప్రస్తుతం 45కు పైగా ఉత్పత్తులను మార్కెట్ లోకి అందిస్తున్న KSDL, అక్కడితో ఆగడం లేదు. భవిష్యత్తులో మరిన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేయడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలని యోచిస్తోంది. విభిన్న వినియోగదారుల అవసరాలను తీర్చేలా, వినూత్నమైన ఉత్పత్తులను పరిచయం చేస్తూ, మార్కెట్ లో తన వాటాను పెంచుకోవడమే కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళిక.