Amazon, Flipkart, Myntra, మరియు Meesho వంటి దిగ్గజాలు చిన్న పట్టణాల కస్టమర్లను ఆకట్టుకునేందుకు వీడియో-లెడ్ షాపింగ్ ఫీచర్లను తీసుకొస్తున్నాయి. 2030 నాటికి ఈ రంగంలో $25 బిలియన్ల GMV లక్ష్యంగా పెట్టుకోగా, ఈ కొత్త వ్యూహం ద్వారా డిస్కౌంట్లకు బదులుగా కంటెంట్ ఆధారిత సేల్స్ పెంచాలని చూస్తున్నాయి.
భారతీయ ఈ-కామర్స్ మార్కెట్ పూర్తిగా మారుతోంది. Amazon, Flipkart, Myntra, మరియు Meesho వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు కేవలం ఫోటోలతో కూడిన క్యాటలాగ్‌ల నుంచి క్రియేటర్-లెడ్ వీడియో మరియు లైవ్-స్ట్రీమింగ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా Tier-2, Tier-3 నగరాల్లోని కస్టమర్లు బ్రాండెడ్ ప్రకటనల కంటే తోటి వినియోగదారుల సూచనలను (Peer recommendations) ఎక్కువగా నమ్ముతారు. దీనిని క్యాష్ చేసుకోవడమే ఈ కొత్త వ్యూహం ఉద్దేశ్యం.
వృద్ధి బాటలో కంటెంట్ కామర్స్
సాంప్రదాయక భారీ డిస్కౌంట్ మోడల్ నుంచి బయటపడేందుకు కంపెనీలు కంటెంట్-లెడ్ కామర్స్‌ను ఒక అస్త్రంగా వాడుతున్నాయి. దీని ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. Meesho తన కంటెంట్-కామర్స్ ఎకోసిస్టమ్ ద్వారా ఏకంగా 152% వార్షిక వృద్ధిని నమోదు చేయగా, Amazon తన క్రియేటర్-లెడ్ సేల్స్‌లో 70% వాటా చిన్న పట్టణాల నుంచే వస్తోందని తెలిపింది. వీడియో కంటెంట్‌తో ఎంగేజ్ అయ్యే కస్టమర్లలో కన్వర్షన్ రేటు 10% ఎక్కువగా ఉండటం కంపెనీలకు ప్లస్ పాయింట్.
ఇన్వెస్టర్లు గమనించాల్సిన రిస్కులు
ఈ మార్పు కేవలం మార్కెటింగ్ మాత్రమే కాదు, భారీ నిర్వహణ ఖర్చులతో కూడుకున్నది. కంటెంట్ క్రియేషన్, ఇన్‌ఫ్లుయెన్సర్ పార్టనర్‌షిప్స్ మరియు ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ కోసం కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు, Advertising Standards Council of India (ASCI) నిబంధనలు కూడా కఠినంగా ఉన్నాయి. కంటెంట్ క్వాలిటీ మరియు బ్రాండ్ సేఫ్టీ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా, అది రెగ్యులేటరీ పెనాల్టీలకు దారితీసే అవకాశం ఉంది.
లాభాల మాటెంటీ?
2030 నాటికి $25 బిలియన్ల GMV లక్ష్యంగా సాగుతున్న ఈ రంగంలో, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ (CAC) ను అదుపులో ఉంచుకోవడం అతిపెద్ద సవాలు. వీడియో షాపింగ్ ద్వారా కస్టమర్ల రిటెన్షన్ పెరుగుతుందా లేక డిస్కౌంట్ కూపన్ల ఖర్చు ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపుల రూపంలోకి మారుతుందా అనేది ఇప్పుడు ఇన్వెస్టర్ల ముందున్న అతిపెద్ద ప్రశ్న. కంపెనీలు కంటెంట్ ద్వారా లాభాలను పెంచుకుంటాయా లేదా అన్నది రాబోయే క్వార్టర్ రిజల్ట్స్‌లో తేలనుంది.
