DIIల కొనుగోళ్లతో ITC స్టాక్ లో రికవరీ!
ITC లిమిటెడ్ స్టాక్ లో గత కొద్ది రోజులుగా మంచి పుంజుకుంది. గత రెండు వారాల్లో సుమారు 5.5% పెరగ్గా, గత నెల రోజుల్లోనూ దాదాపు 5.44% మేర ర్యాలీ సాధించింది. ఈ పెరుగుదలకు కీలక కారణం దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల (DIIs) నుండి లభించిన మద్దతు. గత త్రైమాసికంలో 48.90% గా ఉన్న DIIల వాటా, ప్రస్తుత త్రైమాసికంలో 49.15% కి పెరిగింది. అయితే, దీనికి విరుద్ధంగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) మాత్రం తమ పెట్టుబడులను తగ్గించుకున్నారు. గతంలో 36.11% ఉన్న వారి వాటా, ఇప్పుడు 34.83% కి తగ్గింది.
'యోగ బార్' తో ఫుడ్ మార్కెట్ లోకి ITC భారీ అడుగు!
మరోవైపు, ITC తన ఫుడ్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఒక కీలక అడుగు వేసింది. 'యోగ బార్' (Yoga Bar) వంటి ప్రముఖ బ్రాండ్ లతో మార్కెట్ లో మంచి పేరున్న Sproutlife Foods కంపెనీలో మెజారిటీ స్టేక్ ను కొనుగోలు చేసింది. ఈ వ్యూహాత్మక కొనుగోలు ద్వారా, వేగంగా విస్తరిస్తున్న ఫుడ్ సెక్టార్ లో తన ఉనికిని పటిష్టం చేసుకోవాలని ITC భావిస్తోంది.
