దేశంలో చక్కెర ధరలు మంట పుట్టిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే **38.63%** పెరిగి సగటున కిలో **₹64.24** వద్ద ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ ప్రయత్నాలు విఫలం కావడంతో, ఇన్వెస్టర్లు ఇప్పుడు షుగర్ మిల్లుల మార్జిన్లు మరియు FMCG రంగంపై పడే ప్రభావంపై ఆందోళన చెందుతున్నారు.
ఆగస్టు 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా చక్కెర రిటైల్ ధర సగటున ₹64.24కి చేరుకుంది. ఇది గత నెలతో పోలిస్తే 30% మరియు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 38.63% భారీ పెరుగుదల. ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ఏకంగా 10 లక్షల టన్నుల ముడి చక్కెరను డ్యూటీ-ఫ్రీగా దిగుమతి చేసుకునేందుకు అనుమతిచ్చినా, ధరలు అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తగ్గుతున్న ఉత్పత్తి - పెరుగుతున్న ధరలు
ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఉత్పత్తి తగ్గడమే. 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి గాను చక్కెర ఉత్పత్తి అంచనాలను గతంలో 343 లక్షల టన్నులగా ఉండగా, దాన్ని ఇప్పుడు 306 లక్షల టన్నులకి ప్రభుత్వం తగ్గించింది. వర్షాలు, పంట వ్యాధుల వల్ల దిగుబడి దెబ్బతినడమే దీనికి కారణం. సరఫరా తగ్గుతుండటంతో ధరలకు రెక్కలు వచ్చాయి.
ప్రభుత్వం కఠిన నిర్ణయాలు
ధరల నియంత్రణ కోసం సెప్టెంబర్ 1, 2026 నుంచి బల్క్ యూజర్లపై ప్రభుత్వం 15 రోజుల స్టాక్ హోల్డింగ్ పరిమితిని విధించింది. అంతేకాకుండా, షుగర్ మిల్లులు నెలవారీ అమ్మకాల కోటాను కచ్చితంగా పాటించేలా మానిటరింగ్ చేస్తోంది. మిల్లులకు ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వ జోక్యం వల్ల లాభాల మార్జిన్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
FMCG రంగంపై భారం
చక్కెరను ముడిసరుకుగా వాడే బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ తయారు చేసే FMCG కంపెనీలపై ఈ ధరల ప్రభావం గట్టిగా పడనుంది. ముడిసరుకు ఖర్చులు పెరగడంతో, వీటి కంపెనీల నికర లాభాలు (Net Profit) దెబ్బతినే ఛాన్స్ ఉంది. పండుగ సీజన్ డిమాండ్ వచ్చే కొద్దీ సప్లై పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇన్వెస్టర్లు గమనించాల్సిన కీలక అంశం.
