బంగారం దిగుమతుల్లో భారత్ దూకుడు
భారత్ బంగారం దిగుమతుల్లో ముందుంటుంది. ఏటా సుమారు 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీని విలువ సుమారు $70 బిలియన్ల నుంచి $95 బిలియన్ల వరకు ఉంటుంది. ఇంత భారీగా బంగారం వినియోగించే దేశమైనా, అంతర్జాతీయ గోల్డ్ ధరలను నిర్దేశించే మార్కెట్లలో భారత్ కు పెద్దగా చెప్పుకోదగ్గ ప్రభావం లేదు.
దాగి ఉన్న బంగారం సంపద
ఇండియాలో బంగారం సంపద ఎక్కువగా కుటుంబాల లాకర్లలో, ప్రైవేట్ వాల్ట్లలో నిక్షిప్తమై ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ స్టాక్స్ లో ఇవి ఒకటిగా అంచనా. ఈ నిల్వలు గణనీయమైన ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
ఎక్స్ఛేంజీల ద్వారా బంగారాన్ని సమీకరణ
ఈ ప్లాన్ లో భాగంగా, బలమైన బులియన్ ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా వ్యక్తులు, సంస్థలు తమ దగ్గర ఉన్న నిరుపయోగ బంగారాన్ని ఫార్మల్ ఫైనాన్షియల్ సిస్టమ్ లోకి తీసుకురావడానికి ప్రోత్సహిస్తారు. దీనితో గోల్డ్ మార్కెట్ మరింత క్రమబద్ధీకరించబడి, పారదర్శకంగా, లిక్విడ్ గా మారుతుంది.
గ్లోబల్ ప్రైసింగ్ పై పట్టు సాధించే దిశగా
దేశీయంగా ఉన్న గోల్డ్ రిజర్వ్స్ ను సమీకరించి, అధునాతన ట్రేడింగ్ సిస్టమ్ ను నిర్మించడం ద్వారా, కేవలం బంగారం వినియోగించే దేశం నుంచి గ్లోబల్ గోల్డ్ హబ్ గా మారాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పు ఆర్థిక కార్యకలాపాలను పెంచడమే కాకుండా, భారీ వినియోగానికి తగ్గట్టుగా, అంతర్జాతీయ బంగారం ధరలను నిర్దేశించడంలో భారత్ కు బలమైన గళాన్ని అందిస్తుంది.
