భౌగోళిక ఉద్రిక్తతలకు, బంగారం ధరలకు సంబంధం లేనట్లుందా?
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, బంగారంపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. సాధారణంగా, ఈ ప్రాంతంలో అస్థిరత పెరిగితే బంగారం ధరలు పుంజుకునేవి. కానీ ఈసారి అలా జరగకపోవడం మార్కెట్ డైనమిక్స్‌లో వస్తున్న మార్పును సూచిస్తోంది.
10% పైగా ఉన్న దేశీయ, అంతర్జాతీయ బంగారం ధరల వ్యత్యాసం.. స్థానిక మార్కెట్ పరిస్థితులు, లిక్విడిటీ, దిగుమతి సుంకాలు ధరలను ప్రభావితం చేస్తున్నాయని తెలుస్తోంది.
అంతేకాకుండా, బలపడుతున్న అమెరికా డాలర్, ఫెడరల్ రిజర్వ్ (Fed) నుంచి రాబోయే కఠిన ద్రవ్య విధాన నిర్ణయాల అంచనాలు (Hawkishness) బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. పెట్టుబడిదారులు బంగారం కంటే.. పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ (US Treasury Yields) వంటి వాటిపై పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం కేవలం సురక్షితమైన పెట్టుబడిగా కాకుండా.. లావాదేవీల కోణంలో చూస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో బంగారం ధరలకు మద్దతును దెబ్బతీసే అవకాశం ఉంది.
