భారతదేశంలో ఫిజికల్ గోల్డ్ కొనుగోళ్లలో చాలాకాలంగా స్వచ్ఛత, ధరల ఖచ్చితత్వం, సురక్షితమైన స్టోరేజ్ వంటి సమస్యలున్నాయి. Dhan గోల్డ్ వాల్ట్ వీటిని నేరుగా పరిష్కరించేలా రూపొందించబడింది. ఈ సర్వీస్ నేరుగా ఎంసీఎక్స్ (MCX) ప్రైస్ లకు కనెక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల సంప్రదాయ బంగారం కొనుగోళ్లలో ఉండే అనవసరపు మార్కప్స్ (markups) మరియు హిడెన్ స్ప్రెడ్స్ (hidden spreads) ను తగ్గించవచ్చు.
సెబీ (SEBI) నియంత్రిత క్యాపిటల్ మార్కెట్ ఫ్రేమ్వర్క్ (capital market framework) పరిధిలో గోల్డ్ వాల్ట్ పనిచేస్తుంది. అన్ని ట్రాన్సాక్షన్స్ ఎంసీఎక్స్ సీసీఎల్ (MCXCCL) ద్వారా సెటిల్ అవుతాయి. ఇది ఇన్వెస్టర్లకు సురక్షితమైన, రెగ్యులేటెడ్ మార్గాన్ని అందిస్తుంది. కొనుగోలు చేసిన గోల్డ్, సిల్వర్ ను ఎక్స్ఛేంజ్-రెగ్యులేటెడ్ వాల్ట్స్ (exchange-regulated vaults) లో, సాధారణంగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (institutional investors) ఉపయోగించే కోమ్‌రిస్ (ComRIS) అకౌంట్స్ ద్వారా భద్రపరుస్తారు. దీనివల్ల కౌంటర్ పార్టీ రిస్క్ (counterparty risk) చాలావరకు తగ్గుతుంది.
Dhan ఫౌండర్, CEO ప్రవీణ్ జాదవ్ మాట్లాడుతూ, 'ఎక్స్ఛేంజ్ సెటిల్మెంట్ కాంట్రాక్ట్స్, రెగ్యులేటెడ్ వాల్టింగ్, జీరో కౌంటర్ పార్టీ రిస్క్' వంటివి ఈ ప్రొడక్ట్ కు కీలకం అని తెలిపారు. Dhan ఫౌండర్, COO జయ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, సాధారణంగా పెద్ద ఇన్వెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉండే ఇన్వెస్ట్మెంట్ పద్ధతులను ఎక్కువ మందికి అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఎంసీఎక్స్ (MCX) మేనేజింగ్ డైరెక్టర్, CEO ప్రవీణా రాయ్ కూడా గోల్డ్ ఇన్వెస్టింగ్ లో పారదర్శకత, అందుబాటును పెంచడంలో గోల్డ్ వాల్ట్ కు మంచి భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, Dhan ఇటీవల అల్గోరిథమిక్ ట్రేడింగ్ ప్లాట్ఫారమ్ అయిన స్ట్రాట్జీ (Stratzy) ని కూడా కొనుగోలు చేసింది.
