అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
ఈ భారీ పెంపునకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల అస్థిరతే. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ (Brent crude futures) గురువారం బ్యారెల్ $126 మార్క్ ని తాకి, ఆ తర్వాత కొద్దిగా తగ్గినా, పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ఎనర్జీ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
మన దేశం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) లో చాలా వరకు దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందుకే, కమర్షియల్, నాన్-సబ్సిడైజ్డ్ సిలిండర్ల ధరలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌లను (international benchmarks) దగ్గరగా అనుసరిస్తాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (Oil marketing companies) సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీన అంతర్జాతీయ సగటు ధర, కరెంటు ఫారిన్ ఎక్స్ఛేంజ్ రేటు (foreign exchange rate) ఆధారంగా ఈ ధరలను సమీక్షిస్తాయి.
ప్రభుత్వ నియంత్రణ, వినియోగదారులకు ఊరట
దీనికి విరుద్ధంగా, సుమారు 33 కోట్ల గృహాలు వినియోగించే సబ్సిడీ ఉన్న దేశీయ LPG సిలిండర్ల ధరలు గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్నాయి. ఈ విధానం వినియోగదారులను ద్రవ్యోల్బణం (inflation) నుంచి కాపాడుతుంది, అలాగే నిత్యావసర అవసరాలకు అందుబాటు ధరల్లో ఉండేలా చూస్తుంది. చిన్న వ్యాపారాలు ఎక్కువగా ఉపయోగించే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG (FTL) సిలిండర్ ధర కూడా మార్కెట్ ఆధారిత ధరల ప్రకారం ₹261 పెరిగింది.
రంగాల వారీగా ప్రభావం
కమర్షియల్ LPG ధరల్లో ఈ భారీ పెరుగుదల రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, ఇతర ఫుడ్ బిజినెస్‌లపై నేరుగా ప్రభావం చూపుతుంది. పెరిగిన నిర్వహణ ఖర్చులను వ్యాపారాలు తరచుగా వినియోగదారులపైకి మళ్లిస్తాయి. రాబోయే వారాల్లో రెస్టారెంట్లలో భోజన ధరలు, ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ నెలలో సుమారు 80 శాతం పెట్రోలియం ఉత్పత్తుల ధరల్లో మార్పు లేనప్పటికీ, ప్రధానంగా ఇండస్ట్రియల్, కమర్షియల్ ఉత్పత్తుల్లోనే 16 శాతం మేర పెరుగుదల నమోదైంది.
