Ipca Laboratories: వృద్ధికి కొత్త దారులు
ఫార్మా రంగంలో Ipca Laboratories విషయానికొస్తే, దేశీయ మార్కెట్లో వ్యాపారం పుంజుకోవడం, ఎగుమతులు పెరగడం దీనికి ప్రధాన చోదకశక్తులు. కార్డియాలజీ, డెర్మటాలజీ వంటి కొత్త థెరపీ ఏరియాల్లోకి విస్తరించడంతో పాటు, తన కీలక బ్రాండ్లను మరింత బలోపేతం చేసుకుంటోంది. ముఖ్యంగా యూఎస్, యూరప్ మార్కెట్లలో జెనరిక్స్ వ్యాపారంలో వృద్ధి, యూనికెమ్ వ్యాపార విలీనం (integration) ద్వారా ఖర్చు తగ్గింపు, ప్రొడక్ట్ పైప్‌లైన్ రీబిల్డింగ్ వంటివి కంపెనీ ఆదాయాన్ని పెంచుతాయని అంచనా.
AU Small Finance Bank: యూనివర్సల్ బ్యాంక్‌గా ఎదుగుదల
ఇక AU Small Finance Bank విషయానికొస్తే, యూనివర్సల్ బ్యాంక్‌గా మారడం దీనికి అతిపెద్ద ప్లస్ పాయింట్. దీని ద్వారా రిటైల్, MSME, మిడ్-కార్పొరేట్ లెండింగ్‌లో మార్కెట్ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. పోర్ట్‌ఫోలియోలో ఫ్లెక్సిబిలిటీ, క్రాస్-సెల్లింగ్ అవకాశాలు, విభిన్న డిపాజిట్ బేస్, మెరుగైన CASA రేషియో, 2,700 కు పైగా విస్తరించిన నెట్‌వర్క్ వంటివి రుణ వృద్ధికి దోహదపడతాయి. బ్యాంకు సురక్షితమైన రుణాలపై (secured lending) దృష్టి సారించి, జాగ్రత్తగా అంచనా వేయడం (underwriting) ద్వారా క్రెడిట్ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలని భావిస్తోంది. రాబోయే FY26-FY28 మధ్య కాలంలో, బ్యాంకు రుణ వృద్ధి 24% వార్షిక వృద్ధిని, ఆదాయం 36% వార్షిక వృద్ధిని సాధిస్తుందని మోతిలాల్ ఒస్వాల్ అంచనా వేస్తోంది.