JP Morgan ఈ నిర్ణయం వెనుక ఉన్న వ్యూహాత్మక మార్పును స్పష్టం చేసింది. AI, సెమీకండక్టర్స్, డేటా సెంటర్స్ వంటి రంగాల్లో దూసుకుపోతున్న మార్కెట్లకు పెట్టుబడులను మళ్లించాలని చూస్తోంది. ముఖ్యంగా, దక్షిణ కొరియా వంటి దేశాలు AI చిప్‌మేకర్లతో దూసుకుపోతుండటంతో, అక్కడి KOSPI సూచీ భారీగా రాణిస్తోంది. కానీ, ఇండియాలోని పెద్ద కంపెనీలకు మాత్రం ఈ AI రంగంలో చెప్పుకోదగ్గ ఎక్స్‌పోజర్ లేదని JP Morgan అభిప్రాయపడింది.
భారత మార్కెట్ ప్రస్తుతం అధిక వాల్యుయేషన్లలో ట్రేడ్ అవుతోందని JP Morgan పేర్కొంది. Nifty 50 సూచీ P/E 20.8 వద్ద ఉంది. ఇది దాని 10 ఏళ్ల సగటు 24.79 కంటే తక్కువే అయినా, బ్రెజిల్ (12.6x) వంటి మార్కెట్లతో పోలిస్తే చాలా ఎక్కువ. అదే సమయంలో, రాబోయే కాలంలో కంపెనీల ఆర్జితులపై (Earnings) ఒత్తిడి పెరగవచ్చని హెచ్చరించింది. ముడిసరుకుల ధరలు పెరగడం, సరఫరా సమస్యలు, కరెన్సీ విలువ పడిపోవడం వంటివి లాభాలను దెబ్బతీయవచ్చని, అందుకే అనలిస్టులు కూడా కీలక రంగాలకు సంబంధించిన 2027 ఆర్జిత అంచనాలను 2%-10% వరకు తగ్గించారని నివేదిక పేర్కొంది.
ఇంకా, కంపెనీలు కొత్త షేర్లను జారీ చేయడం (Share Issuance) వల్ల ప్రస్తుత వాటాదారుల విలువ తగ్గిపోతోందని JP Morgan ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో కంపెనీలు షేర్ బైబ్యాక్‌లు చేస్తే, ఇక్కడ మాత్రం క్యాపిటల్ రైజింగ్ కోసం కొత్త షేర్లు జారీ చేస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో షేర్ ధరల పెరుగుదలను పరిమితం చేయవచ్చని అంచనా. వీటితో పాటు, వర్షాకాలంపై ఆధారపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఆహార ద్రవ్యోల్బణం, RBI వడ్డీ రేట్లపై ఒత్తిడి వంటి అంశాలు కూడా దేశీయ మార్కెట్‌కు ప్రతికూలంగా మారవచ్చని JP Morgan తన రిపోర్ట్‌లో పేర్కొంది.
AI వంటి ప్రపంచ ట్రెండ్స్‌లో ఇండియాకు తక్కువ భాగస్వామ్యం ఉండటమే, అధిక వాల్యుయేషన్లకు ప్రతికూలత అని JP Morgan అభిప్రాయపడింది. అయితే, అన్ని బ్రోకరేజీలు ఇలానే ఆలోచించడం లేదు. ఉదాహరణకు, Morgan Stanley మాత్రం భారత స్టాక్ మార్కెట్ బుల్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తోంది. ఏదేమైనా, JP Morgan ప్రస్తుత పరిస్థితుల్లో AI వంటి గ్రోత్ డ్రైవర్స్‌లో నేరుగా భాగస్వామ్యం ఉన్న మార్కెట్లు మెరుగ్గా రాణించవచ్చని భావిస్తోంది.
